international drug gang
-
హైదరాబాద్ నుంచి విదేశాలకు డ్రగ్స్
అల్వాల్: హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుండి 9 కోట్ల రూపాయల విలువ చేసే 8.5 కేజీల సుడోపెడ్రిస్ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన రహీమ్, ఫరీద్, ఫైజల్ అనే వ్యక్తులు ప్రధాన సూత్రదారులుగా హైదరాబాద్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ ముఠా కొనసాగుతోంది. సింథటిక్ డ్రగ్‌ను లుంగీల ప్యాకెట్ పేరుతో కొరియర్ ద్వారా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం నాచారం పోలీసుల సహకారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. ఈ డ్రగ్ ఒక కేజీ బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయలకు విక్రయిస్తారన్నారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలను దృష్ట్రిలో పెట్టుకొని ఈ ముఠా విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సీపీ తెలిపారు. -
డ్రగ్స్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ప్రధాన నిందితుడు టోనీ
Latest Updates: 2:00PM ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ డేవిడ్ అలియాస్ టోనీ కస్టడి విచారణ కొనసాగుతోంది. పంజాగుట్ట పీఎస్‌లో ప్రత్యేక గదిలో భారీ భద్రత మధ్య విచారణ జరుగుతోంది. ప్రత్యేక ప్రశ్నావలి సిద్దం చేసుకొని పోలీసులు టోనీని ప్రశ్నిస్తున్నారు. అలాగే టోనీని ప్రశ్నించేందుకు ట్రాన్సిలేటర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అరెస్ట్ అయిన తమ్మిది మంది కంజూమర్స్తో సంబందాలాపై పోలీసులు ఆరా తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇంకా ఎంతమందితో పరిచయాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. టోనీ ఏజంట్స్ ఇమ్రాన్, నూర్‌లతో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతమంది ఏజంట్స్ ఉన్నారు, టోనీ కాల్ లీస్ట్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఎవరివి? ఆ వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ముఠాలో కీలక వ్యక్తిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ టోనీని హైదరాబాద్ పోలీసులు శనివారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అతడిని తదుపరి విచారణ నిమిత్తం బుధవారం వరకు(అయిదు రోజులు) పంజగుట్ట పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్‌గూడ జైలునుంచి పోలీసులు టోనీని తరలించారు. 34 మంది వ్యాపారులకు టోకు టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యాపారస్తుల్ని కస్టడీకి అప్పగించాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇతడి విచారణలో మరికొందరు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతడితో పాటు అరెస్టు అయిన ఏడుగురిని కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు అనుమతించలేదు. దీంతో దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలిసారిగా వినియోగదారులు అరెస్టు నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ తగ్గిస్తేనే సరఫరా ఆగుతుందనే ఉద్దేశంతో సీపీ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ విక్రేతలతో పాటు వినియోగదారులనూ అరెస్టు చేయించారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వీరిలో టోనీ, ముగ్గురు దళారులు మినహాయిస్తే మిగిలిన వినియోగదారులంతా నగరంలోని పెద్ద కుటుంబాలకు చెందిన వారే. వీరిలో పది మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. టోనీ సహా ఇతర పెడ్లర్ల కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు దాని ఆధారంగా మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్ షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబుతో పాటు అతడి భార్య, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాష్, సంజయ్ గర్దపల్లి, అశోక్ జైన్ కొనుగోలు, వినియోగదారులుగా గుర్తించారు. టోనీ తదితరుల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. చదవండి: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ సిటీలో ఇంకెందరు ఉన్నారో..? నైజీరియా నుంచి వచ్చి ముంబైలో అక్రమంగా నివసిస్తున్న టోనీ 2013 నుంచి డ్రగ్స్ మాఫీయాను నడుపుతున్నాడు. దాదాపు అప్పటి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇతడి కస్టమర్ల జాబితాలో దాదాపు 60 మంది వరకు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కొకైన్ సరఫరా చేసే టోనీ ఒక్కోసారి గ్రాము రూ.20 వేలకు విక్రయించాడు. ఈ స్థాయిలో డబ్బు వెచ్చించి ఖరీదు చేసే వారిలో సంపన్నులే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, వీఓఐపీ కాల్స్ ద్వారా ఇతడు దందా చేస్తుండటంతో కాల్ డేటాలో అందరి వివరాలు బయటకురాకపోవడంతో కస్టడీలో రాబట్టాలని భావిస్తున్నారు. నగరంలోని కొన్ని స్టార్ హోటల్స్, పబ్స్, రిసార్టుల నిర్వాహకులతో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ద్వారా తన దందా నిర్వహించినట్లు అనుమానిస్తూ ఆ కోణంలో విచారించాలని నిర్ణయించారు. ‘టోనీని శనివారం నుంచి పంజగుట్ట ఠాణాలో విచారిస్తాం. ఎంత మంది వ్యాపారస్తులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయో గుర్తిస్తాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి’ అని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. -
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- సిటీకి గోవా నుంచి కొకైన్ డ్రగ్ సరఫరా - రెండు ప్రాంతాల్లోని నైజీరియన్ల దందా - అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు - కొకైన్‌తో పాటు బ్రౌన్‌షుగర్ స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్‌షుగర్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్లు ఎల్.రాజా వెంకటరెడ్డి, పి.బల్వంతయ్యలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. వస్త్రవ్యాపారం ముసుగులో... నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 మధ్య బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చారు. కోయంబత్తూర్‌లో వస్త్రాలు ఖరీదు చేసి నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు. సొలోమెన్, చుకు, ప్రామిస్‌లు హైదరాబాద్‌లోని బండ్లగూడ, సైనిక్‌పురి, టోలిచౌకి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మిగిలిన నలుగురూ గోవాలో ఉంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొకైన్‌ను సమీకరిస్తున్న రఫెల్ దీన్ని విక్రయించడం కోసం దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికైనా డ్రగ్ సరఫరా చేయడానికి అనోరా, పీటర్లను వినియోగించుకునే వాడు. వీరిద్దరూ బస్సులు, రైళ్ళల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ ఇచ్చి వచ్చేవారు. రూ.2.5 వేలకు ఖరీదు, రూ.5 వేలకు విక్రయం... రఫెల్ ఈ మాదకద్రవ్యాన్ని గ్రాము రూ.2,500 నుంచి రూ.3 వేలకు ఖరీదు చేస్తున్నాడు. దీన్ని తన ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముతున్నాడు. ఈ ఏజెంట్లు ఆయా నగరాల్లో తమకు కస్టమర్లుగా ఉన్న విద్యార్థులు, యువతకు భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ప్రామిస్ అనే నైజీరియన్ జాన్ అనే మరో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొకైన్, బ్రౌన్‌షుగర్ ఖరీదు చేసి విక్రయిస్తున్నాడు. రఫెల్ అందరు నిందితులూ హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం అందుకున్న వెస్ట్, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుళ్ళు ముర్తుజా, మధు, సందీప్ అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో సీసీఎస్‌లోని నార్కొటిక్ సెల్ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్నారు. బుధవారం ఏడుగురినీ అరెస్టు చేసి ‘సరుకు’, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వస్త్రాల రూపంలో స్వదేశానికి... ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల దందాలో సంపాదించింది మొత్తం తన స్వదేశానికి వస్త్రాల రూపంలో పంపేస్తున్నారు. ప్రతి డీల్‌లోనూ వచ్చిన లాభాలతో కోయంబత్తూర్‌లో రెడీమేడ్, ఇతర వస్త్రాలు ఖరీదు చేస్తున్నారు. వీటిని నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేస్తూ, తమ అనుచరులు ద్వారా అమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడుగరిలో అనేక మందిపై హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై తదితర నగరాల్లో కేసులున్నాయి. ఈ వివరాలన్నీ సేకరిస్తున్న పోలీసులు నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం యాంటీ నార్కొటిక్స్ సెల్‌కు అప్పగించారు. -
రూ.కోటి విలువ చేసే కిలో మత్తుమందు స్వాధీనం
ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాల ద్వారా పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు చేరిన హెరాయిన్ మత్తు మందు సోమవారం ఎల్బీ నగర్ ప్రాంతంలో స్థానిక స్మగ్లర్ల చేతులు మారుతుడంగా ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు మెరుపు దాడి జరిపి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి విలువ చేసే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సత్యనారాయణ, యేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఎన్సీబీ వర్గాల ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలు పాకిస్థాన్ నుంచి రాజస్థాన్,హైదరాబాద్ మీదుగా దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు హెరాయిన్‌ను తరలిస్తుండా పక్కా సమాచారంతో దాడులు జరిపి పట్టుకున్నారు.