
గోపీకృష్ట, మహేంద్ర, ప్రదీప్, శిల్ప, తేజు, ప్రియాంక ప్రధాన పాత్రల్లో ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. బెస్ట్ విన్ ప్రొడక్షన్ పతాకంపై భీమినేని సురేష్ జి, రామకృష్ణారావు నిర్మించారు. ఎస్.వి.మల్లిక్ తేజ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కొందరికి రుణపడుతుంటారని, ఆ రుణం తీర్చుకోవాలనే కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. సంగీత దర్శకుడు మల్లిక్ తేజ్ ఈ చిత్రంలోని అన్ని పాటలు రాయడంతో పాటు ఓ పాట పాడడం విశేషం.
పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికీ మేం రుణపడి ఉంటాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, తొలి కాపీతో విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, ఎస్.గుండ్రెడ్డి, ఎస్.వి. మల్లిక్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment