బుల్లెట్ రైలు నమూనా తయారు చేసిన శిల్ప | 10th class student makes bullet train model | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రైలు నమూనా తయారు చేసిన శిల్ప

Published Fri, Sep 12 2014 1:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

10th class student  makes bullet train model

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్కు చెందిన పదో తరగతి విద్యార్థి బుల్లెట్ రైలు నమూనాను తయారు చేసింది. హమీర్పూర్ జిల్లా సుదియల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగది చదువుతున్న శిల్ప ఈ ఘనత సాధించింది. ఈ నమూనా జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శకు ఎంపికకావడం విశేషం.

అయస్కాంత సజాతి ధృవాల వికర్షణ సిద్ధాంతం ఆధారంగా శిల్ప ఈ నమూనాను రూపొందించింది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ఎంపికైన ఈ నమూనాను అక్టోబర్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనలతో ఈ నమూనాను రూపొందించానని, సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసేందుకు దృష్టిసారిస్తానని శిల్ప చెప్పింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement