
సిక్స్‌ప్యాక్... కాకతీయుడు
‘విద్య, వైద్య వ్యవస్థలను ప్రైవేటీకరించడం వల్ల మధ్యతరగతి వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? స్వార్థ రాజకీయ నాయకుల వల్ల సమస్యలేంటి?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కాకతీయుడు’. తారకరత్న, శిల్ప, యామిని, రేవతి ప్రధాన పాత్రల్లో వి. సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రంలో తార కరత్న తొలిసారి సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఆర్ శంకర్, కెమేరా: పి.సహదేవ్, సహ నిర్మాతలు: గుర్రం మహేశ్‌చౌదరి, గూడూర్ గోపాల్‌శెట్టి, పొందూరు కాంతారావు.