పుల్లు (ఫైల్)
కారేపల్లి: దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో దిగులుపడి న ఓ మిర్చి రైతు పురుగులమందు తాగి చేనులో నే విగతజీవిగా మారాడు. మిర్చి పంటను తా మర పురుగు, ఇతర తెగుళ్లు ఆశించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యం లో ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా, సోమవారం మరొకరు బలవనర్మరణానికి పాల్పడ్డారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటురేలకాయలపల్లికి చెందిన వాంకుడోతు పుల్లు(58) తనకున్న నాలుగెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.5 లక్షల అప్పు చేశాడు. అయితే తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి వచ్చే పరి స్థితి లేకపోవడం, అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో ఆవేదన చెందిన పుల్లు సోమ వారం ఉదయం చేను వద్దే పురుగులమందు తాగాడు. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment