Indore Woman Allegedly Died By Suicide After Husband Stops Going To Beauty Parlour In MP - Sakshi
Sakshi News home page

Madhya Pradesh: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..

Published Sat, Apr 29 2023 8:23 AM | Last Updated on Sat, Apr 29 2023 10:16 AM

Indore Woman Allegedly Died Husband Stops Going To Beauty Parlour - Sakshi

ఓ మహిళ చిన్న విషయానికి క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకుని విగత జీవిగా మారింది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటున్న 34 ఏళ్ల మహిళ బ్యూటీపార్లర్‌కు వెళ్లాలనుకుంది. అందుకు భర్త అంగీకరించకపోగా అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది.

ఈ మేరకు ఆ మహిళ క్షణికావేశంలో కోపంతో ఫ్యాన్‌కి ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. బాధితురాలి భర్త విచారణలో.. తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా అడ్డుకోవడంతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పాడు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి అయిన తదనంతరం అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తామని పోలీసు అధికారి యాదవ్‌ తెలిపారు. 

(చదవండి: శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్‌ విషయాలు వెల్లడించిన సీపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement