Rishiteshwari
-
రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీగా వైకే
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మరో ప్రముఖ న్యాయవాది మల్లిఖార్జునరావును నియమించింది. గుంటూరులో కేసు విచారణ జరుగుతున్న పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ఈనెల 15న విచారణ జరగనుంది. కేసులో తమను స్పెషల్ పీపీ, ఏపీపీగా నియమిస్తూ జీవో 364 ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టుకు, న్యాయవాదులకు చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు వైకే సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఏప్రిల్ ఏడోతేదీన విడుదల చేసిన ఉత్తర్వులు ఈఏడాది జూన్ 28న అందజేసినట్లు చెప్పారు. ఈలోగా కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ సాక్షుల నుంచి కోర్టులో వాంగ్మూలాలను రికార్డు చేయడం పూర్తయిందని, నిందితుల తరఫున డిఫెన్స్ సాక్ష్యం నమోదు దశకు చేరుకుందని తెలిపారు. ఈనెల ఒకటో తేదీన కోర్టు వాయిదాకు హాజరైన స్పెషల్ పీపీ వైకే, ఏపీపీ మల్లిఖార్జునరావు కోర్టుకు హాజరై ప్రాసిక్యూషన్ నిర్వహణకు సంసిద్ధత తెలియజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని న్యాయాధికారికి అందజేశారు. ఇప్పటివరకు కేసులో జరిగిన పురోగతిని, సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేసిన పత్రాలతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసి ప్రాసిక్యూషన్‌ను చట్టపరమైన పద్ధతిలో నిర్వహిస్తామని కోర్టుకు వైకే విన్నవించారు. నిందితుల తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు కేసును ఈనెల 15కు వాయిదా వేశారని వైకే తెలిపారు. ఈ కేసులో నాటి ఏఎన్‌యూ బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, ముగ్గురు బీఆర్క్ విద్యార్థులు నిందితులని చెప్పారు. (క్లిక్: తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..) -
'దిశ' అప్పుడు ఉంటే.. మా అమ్మాయి బతికేది!
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' చట్టం.. నాలుగేళ్ల కిందటే వచ్చి ఉంటే.. తమ కూతురు బలవన్మరణానికి పాల్పడకుండా ఇవాళ బతికే ఉండేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సత్వరమే కఠినశిక్ష విధించేలా తీసుకొచ్చిన దిశ చట్టంపై రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ,దుర్గాబాయ్ మాట్లాడారు. దిశ చట్టంతో ఆడపిల్లలు, మహిళలు ఎంతో ధైర్యంగా ఉంటారని, వారితో అసభ్యంగా ప్రవర్తించాలని చూస్తే మరణ శిక్ష పడుతుందనే భయం వస్తుందని అన్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి.. రాష్ట్రంలోని ఆడపిల్లల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల విద్యార్థులతో పాటుగా గ్రామీణ స్థాయిలో ప్రజలకు దిశ చట్టంపై అవగహన కల్పించాలని ఈ సందర్భంగా రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరారు. గతంలోకి వెళితే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సహ విద్యార్థుల అమానుష చర్యల (ర్యాగింగ్) కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం రిషితేశ్వరి ఆత్మహత్యకు అప్పటి ప్రిన్సిపలే కారణం -
ఇప్పటికైనా అరెస్టు చేస్తారా లేదా..?
-
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
* రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు * ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడని తేల్చిన పోలీసులు * వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోర్టుకు నివేదన * చార్జిషీట్ వివరాలను గోప్యంగా ఉంచిన వైనం * జనవరి నాలుగో తేదీన తదుపరి విచారణ సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఎట్టకేలకు బాబూరావు పాత్రపై నిగ్గు తేల్చగలిగారు. సుమారు 70 మందిని విచారించగా కళాశాలలో ర్యాగింగ్, హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలి సినా ఆయన పట్టించుకోలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ర్యాగింగ్ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై ర్యాగింగ్ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ హాయ్ ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగే సమయానికి ఆమె మైనర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని సైతం పోలీసులు చార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలిసింది. 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆరు నెలల సమగ్ర విచారణ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు... న్యాయవాది వై.కె. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రిషితేశ్వరి కేసులో బాబూరావును 4వ నిందితుడిగా చేరుస్తూ మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని చెప్పారు. ర్యాగింగ్ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమేకాక, నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని, దీనిపై విచారించి ఆయనను శిక్షించాలని పోలీసులు చార్జిషీట్లో కోరారని తెలిపారు. నిందితులపై గతంలో నమోదైన ఐపీసీ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4తోపాటు, బాలికలపై లైంగిక అత్యాచారాల రక్షణ చట్టంలోని 7, 8, 11, 12 సెక్షన్ల కింద కూడా విచారించి శిక్షించాలని పోలీసులు చార్జిషీట్ ద్వారా కోర్టును కోరారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి జనవరి 4వ తేదీకి కేసును వాయిదా వేసిందని తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున తానూ వాదనలు వినిపించనున్నట్లు చెప్పారు. బాబూరావును నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, చార్జిషీట్‌తో సంబంధం లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చని వై.కె. అన్నారు. కాల్‌మనీ కేసులో నిందితుడు సత్యానందంలాగా బాబూరావు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం పోలీసులే ఇస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
-
ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
-
వేధింపులతో సగం చచ్చిపోయా!
-
వేధింపులతో సగం చచ్చిపోయా!
రిషితేశ్వరి మరో డైరీ లభ్యం గుంటూరు పోలీసులకు అందజేసిన తల్లిదండ్రులు అభిషేక్, ఆదిత్య సైతం ప్రేమ పేరుతో వేధించారు సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసుకున్న మరో డైరీ బయటపడింది. ఇప్పటికే ఒక డైరీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వరంగల్‌లోని తమ ఇంట్లో రెండో డైరీని గుర్తించిన రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి గుంటూరులోని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ డైరీలోని 13 పేజీల్లో రిషితేశ్వరి తనను సీనియర్లు వేధించిన తీరును కళ్లకు కట్టినట్లు రాసుకుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి అనుభవించిన నరకయాతన గురించి డైరీలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. మొద టి డైరీలో తనను వేధింపులకు గురిచేసిన సీనియర్ల గురించి రాసినప్పటికీ ఆ పేర్లు కొట్టివేసి ఉన్నాయి. దాంతో అవి తమ పేర్లు కాదని రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు బుకాయిస్తున్నారు. తాజాగా బయటపడ్డ రెండో డైరీలో మాత్రం రిమాండ్‌లో ఉన్న సీనియర్ విద్యార్థులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్‌ల పేర్లను రిషితేశ్వరి స్పష్టంగా రాసుకుంది. శ్రీనివాస్, జయచరణ్‌లు తమను ప్రేమించాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేసేవారని, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించారని డైరీలో పేర్కొంది. ఈ విషయం తెలిస్తే తన తండ్రి బాధపడతారనే ఉద్దేశంతో చెప్పలేకపోయినట్లు రాసుకుంది. సీనియర్లతో ప్రేమ వ్యవహారం కొనసాగించాలంటూ హనీషా తనపై పదేపదే ఒత్తిడి తీసుకొచ్చిందని, తాను వినకపోయేసరికి వరుసకు అన్నయ్య అయిన జితేంద్రతో తనకు అక్రమ సంబంధం అంటగట్టి, రూమర్లు సృష్టించి, తీవ్రంగా వేధించారని డైరీలో రాసింది. అంతేకాకుండా మరో ఇద్దరు విద్యార్థులు అభిషేక్, ఆదిత్య కూడా తమను ప్రేమించమంటూ ప్రతిపాదించారని, దీంతో షాక్‌కు గురయ్యానని, ఎవరిని నమ్మాలో, ఎవరితో స్నేహంగా ఉండాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయానని వెల్లడించింది. సీనియర్ల వేధింపులతో తాను సగం చచ్చిపోయినట్లు అయిందని పేర్కొంది. రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు గుంటూరు పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. ఈ డైరీలోని మరికొన్ని విషయాలు బయటపడాల్సి ఉంది. -
'రిషితేశ్వరి ఆత్మహత్య' కారకులకు రాజకీయ అండ
-
మధువర్ధన్‌రెడ్డిది సర్కారు హత్యే
కదిరి: ‘మొన్న రిషితేశ్వరి ర్యాగింగ్‌తో కన్నుమూసింది. నిన్న మధువర్ధన్రెడ్డిని కూడా అదే ర్యాగింగ్ భూతం మింగేసింది. ప్రభుత్వం మొద ట్లోనే తగిన చర్యలు తీసుకున్నట్లైతే ర్యాగింగ్ భూతానికి మధు బలయ్యేవారు కాదు. మధువర్ధన్‌రెడ్డిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదు..సర్కారు హత్య’ అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మధువర్ధన్‌రెడ్డి తండ్రి బ్రహ్మానందరెడ్డి, సోదరుడు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి శనివారం అన్ని విద్యార్థి సంఘాలు అనంతపురం జిల్లా కదిరిలో మానవహారంతో పాటు రాస్తారోకో నిర్వహించారు. ర్యాగింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించక పోవడంతోనే వరుసగా మెరిట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు రాఘవేంద్ర, రాజేంద్ర తదితరులు పేర్కొన్నారు. ‘‘అక్కడ జరిగిన విషయం నా కొడుకు ఇంటికొచ్చి చెప్పగానే నేను ఆ కళాశాల వారితో మాట్లాడాను. వారు నా మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ జూలై 25వ తేదీన కూడా నా కొడుకు మధు, నేను మరోసారి ఆ కాలేజ్‌కి వెళ్లి అడిగాం. నన్ను ర్యాగింగ్ చేసి, బాగా కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా వాడు వాళ్లను గట్టిగా అడిగాడు. వాళ్లు ‘ఆఆఆఆ..ఇవన్నీ మామూలే. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోకూడదు..ర్యాగింగ్ అనేది కామన్’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నా కొడుక్కు కోపమొచ్చింది..లగేజ్ తీసుకొని వచ్చేశాం. మళ్లీ 30వ తేదీ వాళ్లే ఫోన్ చేసి ‘‘మీ వాడు మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. వాడు కచ్చితంగా ఇంటర్లో నెల్లూరు టాపర్‌గా ఉంటాడు. మీవాడితో పాటు మా కాలేజ్‌కి కూడా మంచి పేరొస్తుందని చెప్పడంతో వాడితోనే మాట్లాడండని ఫోన్ మధుకు ఇచ్చాను. వాళ్లు ఏం మాట్లాడారో..ఏమో గానీ నా బిడ్డను మాత్రం పోగొట్టుకున్నానయ్యా..వాడు చాలా మంచోడూ..చాలా తెలివైనవాడు..’’ అంటూ ఆ విద్యార్థి తండ్రి బ్రహ్మానందరెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ విద్యార్థి కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ కళాశాల గుర్తింపును రద్దు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని జాతీయ రహదారిపైనే 3 గంటల పాటు బైఠాయించారు. తొలుత తహసీల్దార్ నాగరాజు అక్కడికి చేరుకొని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారు వినకపోయేసరికి పోలీసులు ఆర్డీఓ రాజశేఖర్‌ను అక్కడికి పిలిపించి నచ్చజెప్పేలా చూశారు. ఈ సంఘటనపై విచారణ వేగవంతం చేశామని, ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఇప్పటికే కదిరి డీఎస్పీ ఎన్వీ రామాంజనేయులు నెల్లూరుకు వెళ్లి ఆ కళాశాల విద్యార్థులు, యాజమాన్యంతో వేర్వేరుగా మాట్లాడి విచారిస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగంతోపాటు ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.