ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. దోషులెవరో తేల్చినా చర్యలకు సిద్ధంగా లేదు. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక దుస్సంఘటనలకు అతడే కారణమని తేల్చింది.