Architecture student
-
సోషల్ మీడియాతో పాపులర్ సింగర్ అయిన డిసోజా
బెంగళూరుకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ ఫ్రిజెల్ డిసోజా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రకరకాల పాటల గురించి పోస్ట్‌లు, వీడియోలు పెట్టడం ద్వారా ఇండియన్ ఇండీ మ్యూజిక్ ప్రపంచంలోకి వచ్చింది. లాక్డౌన్ కాలంలో ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘సమ్‌థింగ్ న్యూ’ పాట ఐడియా వచ్చింది. ఈ డెబ్యూ సాంగ్ ద్వారా డిసోజా మెలోడియస్ వాయిస్‌కు మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించి, వినిపించే డిసోజా లైవ్ ప్రోగ్రామ్స్‌లో కూడా పాల్గొంది. ఫస్ట్ టూర్లో వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఆమెకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఇక రచన విషయానికి వస్తే...లవ్, హార్ట్‌బ్రేక్‌కు సంబంధించిన అంశాలపై పాటలు రాయడం డిసోజాకు ఇష్టం.‘వ్యక్తిగత అనుభవాల నుంచి చూసిన, విన్న విషయాల ఆధారంగా పాటలు రాయడం నాకు సులభం’ అంటుంది. మొదట్లో తన పాటల్లో ఎలక్ట్రిక్ గిటార్, డ్రమ్‌ల శబ్దం లిరిక్స్‌ను డామినేట్ చేసేది. ఇప్పుడు మాత్రం లిరిక్స్ కూడా స్పష్టంగా వినబడే ఈజీ–టు–లిజెన్ వైబ్కు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అయిన డిసోజా ఫుల్–టైమ్ మ్యూజిషియన్‌గా ఉండడమే తనకు ఇష్టం అంటుంది. View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) View this post on Instagram A post shared by Frizzell D'Souza (@frizzell.dsouza) -
రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీగా వైకే
గుంటూరు ఎడ్యుకేషన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గుంటూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మరో ప్రముఖ న్యాయవాది మల్లిఖార్జునరావును నియమించింది. గుంటూరులో కేసు విచారణ జరుగుతున్న పోక్సో కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో ఈనెల 15న విచారణ జరగనుంది. కేసులో తమను స్పెషల్ పీపీ, ఏపీపీగా నియమిస్తూ జీవో 364 ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టుకు, న్యాయవాదులకు చేరుకోవడంలో జాప్యం జరిగినట్లు వైకే సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గతేడాది ఏప్రిల్ ఏడోతేదీన విడుదల చేసిన ఉత్తర్వులు ఈఏడాది జూన్ 28న అందజేసినట్లు చెప్పారు. ఈలోగా కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్ సాక్షుల నుంచి కోర్టులో వాంగ్మూలాలను రికార్డు చేయడం పూర్తయిందని, నిందితుల తరఫున డిఫెన్స్ సాక్ష్యం నమోదు దశకు చేరుకుందని తెలిపారు. ఈనెల ఒకటో తేదీన కోర్టు వాయిదాకు హాజరైన స్పెషల్ పీపీ వైకే, ఏపీపీ మల్లిఖార్జునరావు కోర్టుకు హాజరై ప్రాసిక్యూషన్ నిర్వహణకు సంసిద్ధత తెలియజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని న్యాయాధికారికి అందజేశారు. ఇప్పటివరకు కేసులో జరిగిన పురోగతిని, సాక్షుల వాంగ్మూలాన్ని నమోదుచేసిన పత్రాలతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసి ప్రాసిక్యూషన్‌ను చట్టపరమైన పద్ధతిలో నిర్వహిస్తామని కోర్టుకు వైకే విన్నవించారు. నిందితుల తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు కేసును ఈనెల 15కు వాయిదా వేశారని వైకే తెలిపారు. ఈ కేసులో నాటి ఏఎన్‌యూ బీఆర్క్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, ముగ్గురు బీఆర్క్ విద్యార్థులు నిందితులని చెప్పారు. (క్లిక్: తెల్లవారితే ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. అంతలోనే ఉన్నట్టుండి..) -
లారీ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం
బనశంకరి: పాలికె చెత్త లారీ ఢీకొని ఆర్కిటెక్చర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఉప్పారపేటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు...రాజాజీ నగర నివాసి నరసరాజ్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె బీఎన్.సాహిత్య(24) హెసరఘట్ట సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ ఆర్కిటెక్చర్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇక్కడి కన్నింగ్‌హ్యామ్ రోడ్డులో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. మంగళవారం ఉదయం కంపెనీకి స్కూటర్లో బయలుదేరిన సాహిత్య రేస్‌కోర్సు రోడ్డులో వెళుతుండగా వెనుక నుంచి బీబీఎంపీ చెత్త లారీ ఢీకొనడంతో సాహిత్య లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. లారీ డ్రైవర్ పరారీ కగా పోలీసుసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
-
ని‘వేదన’
రిషితేశ్వరి ఘటనపై రెండోరోజూ కొనసాగిన విచారణ విద్యార్థులు, సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ మృతురాలి తల్లిదండ్రుల వాదనలు విన్న కమిటీ నేటితో ముగియనున్న కమిటీ పర్యటన ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యుల కమిటీ గురువారం వర్సిటీలో సమగ్రంగా విచారణ జరిపింది. రెండోరోజైన గురువారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మృతురాలి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. తొలిరోజే ఘటనకు సంబంధించిన కీలకాధారాలు సేకరించిన కమిటీ రెండోరోజు మరింత లోతుగా అభిప్రాయాలు, ఆధారాలు సేకరించే దిశగా దర్యాప్తు జరిపింది. కమిటీని ఉదయం పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కలిసి తమ వాదనలు వినిపించారు. ఐద్వా నాయకురాలు డి.రమాదేవి కమిటీని కలిసి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీకి స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ, పీడీఎస్‌వో, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు కమిటీని కలిశారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు కొందరు తల్లిదండ్రుల సహా కమిటీని కలిసి తమ వాదనలు వినిపించారు. అశ్లీల ప్రతిఘటన సంఘం కన్వీనర్ ఈదర గోపీచంద్ కమిటీ రిషితేశ్వరి తండ్రితో కలిసి ర్యాగింగ్ నిరోధానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కమిటీ విచారణ ముగిసే సమయంలో రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ కమిటీ సభ్యులను కలిశారు. రాత్రి 7:30 గంటల సమయంలో కమిటీ విచారణ ముగించే సమయానికి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.బాబురావు కూడా వసతి గృహానికి వచ్చారు. తల్లిదండ్రులతో కమిటీ సుధీర్ఘంగా సమావేశం రిషితేశ్వరి తల్లిదండ్రులు ఎం.మురళీకృష్ణ, దుర్గాబాయిలతో విచారణ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. కమిటీని కలిసి బయటకు వచ్చిన అనంతరం నార్త్ డీఎస్పీ రామకృష్ణ, ఏఎస్పీ భాస్కరరావులు విడివిడిగా మూడు గంటలపాటు మృతురాలి తల్లిదండ్రులను విచారించారు. రికార్డులు సేకరించిన కమిటీ.. మరోవైపు కేసుకు సంబంధించిన రికార్డులు, పత్రాలను కమిటీ సభ్యులు సేకరిస్తున్నారు. యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు కమిటీ కోరిన రికార్డులను విచారణ గదిలో అందజేస్తున్నారు. నేటితో ముగియనున్న కమిటీ పర్యటన.. ముందుగా నిర్ణయించిన ప్రకారం కమిటీ పర్యటన శుక్రవారంతో ముగియనుంది. మూడోరోజు యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అవసరమైన ప్రభుత్వ శాఖల అధికారులతో ఓ విడత సమావేశమై నివేదికను రూపొందించనుంది. భద్రతా ఏర్పాట్లు.. కమిటీ విచారణ సందర్భంగా ఉదయం నుంచే యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఐడీ కార్డులు పరిశీలించి సిబ్బంది, విద్యార్థులను లోపలికి పంపారు. కమిటీని కలిసేందుకు వచ్చిన వారిని విడివిడిగా లోపలికి అనుమతించారు. -
పక్కదారి పట్టించేందుకే..
ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు ఏఎన్‌యూ : యూనివర్సిటీ వసతి గృహాలు, కళాశాల తరగతులకు పది రోజులు సెలవులు ఇవ్వడం, వసతి గృహాలను ఖాళీ చేయించడం అప్రజాస్వామికమని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు వసతి గృహాల ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వసతి గృహాల నుంచి పరిపాలన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనా భవన్లో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం యూనివర్సిటీ తరగతులకు, వసతి గృహాలకు సెలవులు ప్రకటించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. కుల సంఘాల బోర్డుల తొలగింపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తెలియజేస్తాం : రిజిస్ట్రార్ ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు రిజిస్ట్రార్ పి.రాజశేఖర్, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ సి.రాంబాబు వచ్చి ధర్నా విరమించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు తమ డిమాండ్లను తెలియజేశారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనివర్సిటీ, పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేసు నీరుగార్చేందుకే సెలవులిచ్చారు..! వైఎస్సార్ సీపీ నేతలు మర్రి, మేరుగ ఏఎన్‌యూ : ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకే యూనివర్సిటీకి సెలవులిచ్చారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు శనివారం సాయంత్రం యూనివర్సిటీలో ఇన్చార్జి వీసీ కేఆర్ఎస్ సాంబశివరావును కలిసి వసతి గృహాలు ఎందుకు మూసివేశారని అడిగారు. యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడానికే సెలవు ప్రకటించామని ఇన్చార్జి వీసీ చెప్పారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ కేసును నీరుగార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని అనుమానంగా ఉందన్నారు. యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులే కుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మర్రి, మేరుగ వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షడు పానుగంటి చైతన్య ఉన్నారు.