సాక్షి, హైదరాబాద్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. అటు కశ్మీర్‌లో బీజేపీని విశ్వసించలేదని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.
ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అటు కశ్మీర్‌లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అంటూ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.
ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024
Comments
Please login to add a commentAdd a comment