jammu kashmir assembly
-
ఒమర్అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఖరారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఫైనల్ అయింది. తాను సీఎంగా బుధవారం (అక్టోబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈమేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.సీఎంగా ప్రమాణ స్వీకారానికి లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఇదీ చదవండి: హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు -
హరియాణాలో హ్యాట్రిక్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి. హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీచండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది. మల్లయోధురాలి గెలుపు పట్టు బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 13 మందిమహిళల విజయం 90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు. -
హర్యానా, కశ్మీర్ ఫలితాలపై హరీష్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024 -
కశ్మీర్, హరియాణాల్లో నేడే ఓట్ల లెక్కింపు
చండీగఢ్: హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో మొత్తం మూడు విడతలుగా, హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. -
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ
జమ్మూ:కశ్మీర్లో తొలిసారి పూర్తిమెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.జమ్మూలో శనివారం(సెప్టెంబర్28)నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.‘కశ్మీర్లో ఇప్పటికే పూర్తయిన రెండు దశల ఎన్నికల్లో పోలింగ్ సరళి చూస్తే ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థమవుతోంది.రెండు దశల పోలింగ్‌లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.ప్రజలంతా బీజేపీకే ఓటు వేశారు’అని మోదీ అన్నారు.జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తవగా మూడో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది.మొత్తం ఐదు దశల్లో కశ్మీర్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. ఇదీచదవండి: నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు -
కశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లో రూ.1,500 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్లో ఇటీవలి ఉగ్రదాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. జమ్మూకశ్మీర్ శత్రువులకు తగు రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న జమ్మూకశ్మీర్ యువతను ఆయన అభినందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడ్డుగోడ తొలగిపోయిందని, జమ్మూకశ్మీర్‌లో నేడు భారత రాజ్యాంగం నిజంగా అమలవుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతంగా శాంతిని నెలకొల్పుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.శ్రీనగర్‌లో నేడు యోగా డేఅంతకుముందు, జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు గాను గురువారం సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్(ఎస్కేఐసీసీ)వద్ద ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు దాల్ సరస్సు సమీపంలోని ఎస్కేఐసీసీలో జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 7 వేల మందికి పైగా పాలుపంచుకుని ఆసనాలు వేస్తారు. -
కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు 24 సీట్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది. అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్‌లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు. అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు 70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు. బిల్లుల విశేషాలు.. ► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది. ►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు. ►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు. ►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు. ►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు. ►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి. ►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు. ►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. -
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేను చితకబాదారు
శ్రీనగర్: బీఫ్ వివాదం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో దుమారం రేపింది. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యేను తోటి సభ్యులు అసెంబ్లీలోనే చితకబాదారు. జమ్ము కశ్మీర్లో బీఫ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లోఈ పార్టీ ఏర్పాటు చేశారు. బీఫ్‌ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను ఖాతరు చేయబోనని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై దుమారం చెలరేగింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్, రాజీవ్ శర్మలు.. రషీద్‌పై దాడి చేశారు. స్పీకర్ కవీందర్ గుప్తా ఎదుటే ఆయన్ను చితకబాదారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎమ్మెల్యేలు రషీద్‌ను కాపాడారు. ఇది దురదృష్టకర సంఘటన అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
-
జమ్మూ కశ్మీర్లో హంగ్.. ఝార్ఖండ్‌లో బీజేపీ!!
-
జమ్ము కాశ్మీర్లో హంగ్ అసెంబ్లీ!!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎన్నికలు జరిగిన జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం సీ ఓటర్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఐదు దశల్లో జరిగిన జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27-33 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 32-38 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ 4-10 స్థానాలతోను, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8-14 స్థానాలతోను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటే.. ఈసారి అధికార మార్పిడి తథ్యమని తేల్చారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఈనెల 23వ తేదీ మంగళవారం ఉంటుంది. అదేరోజు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.