న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు తమననిర్వహించిన సర్వే విడుదల చేస్తున్నాయి.
Dainik Bhaskar
- బీజేపీ.. 15-29
- కాంగ్రెస్.. 44-54
- జేజేపీ.. 0-1
- ఐఎన్‌ఎల్‌డీ.. 1-5
- ఆప్.. 0-1
- ఇతరులు.. 4-9
Dhruv Research
- బీజేపీ.. 22-32
- కాంగ్రెస్..50-64
- జేజేపీ.. 0
- ఐఎన్‌ఎల్‌డీ..0
- ఆప్.. 0
- ఇతరులు.. 2-8
Peoples Pulse
- బీజేపీ.. 20-32
- కాంగ్రెస్..49-61
- జేజేపీ.. 0-1
- ఐఎన్‌ఎల్‌డీ.. 2-3
- ఆప్.. 0
- ఇతరులు.. 3-5
Republic Bharat- MATRIZ
- బీజేపీ- 18-24
- కాంగ్రెస్..55-62
- ఆప్..0-3
- జేజేపీ.. 0-3
- ఐఎన్‌ఎల్‌డీ..3-6
- ఇతరులు..2-5
హర్యానా హస్తగతమేనా?
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ప్రకటించింది. ఆ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్-55 , బీజేపీ-26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ, తన ప్రత్యర్థి బీజేపీపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపింది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారని తెలిపింది.
హర్యానా కాంగ్రెస్‌దే అంటున్న మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్
- మ్యాట్రిజ్ సర్వే ప్రకారం హర్యానాలో కాంగ్రెస్‌కు 55 నుంచి 62 సీట్లు..
- హర్యానాలో బీజేపీకి 18 నుంచి 24 సీట్లు మాత్రమే వస్తాయంటున్న మ్యాట్రిజ్
- మూడు నుంచి ఆరు సీట్లకే పరిమితం కానున్న ఐఎన్‌ఎల్‌డీ
సీఎన్‌ఎన్ సర్వే
- హర్యానాలో కాంగ్రెస్‌కు 59, బీజేపీకి 21 సీట్లువచ్చే అవకాశం
కాగా గత రెండు పర్యాయాలుగా హర్యానాలో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మూడోసారి సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామినే ధీమాను వ్యక్తపరుస్తోంది కాషాయ పార్టీ. మరోవైపు పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.
మరి రాష్ట్ర ఓటర్లు బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందివ్వనున్నారా లేక.. మార్పు కోరుకుంటూ కాంగ్రెస్‌కు అందలం ఇవ్వనున్నారా అనేది మరికాసేపట్లో తేలనుంది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం సర్వేల ఆధారంగా తెలిపే వివరాలు మాత్రమే.. అక్టోబర్ 8న వెలువడే అధికారిక ఫలితాలే తుది ఫలితాలు.
Comments
Please login to add a commentAdd a comment