
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో 20 మంది అభ్యర్థులను జాబితాను భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్‌నడ్డా ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 86 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది.