third list
-
బీజేపీ మూడో జాబితా విడుదల.. 146 మంది అభ్యర్థుల ఖరారు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావిడీ నెలకొంది. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ సోమవారం 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. దీంతోపాటు నాందేడ్ లోక్‌సభ ఉపఎన్నికలకు అభ్యర్థిని కూడా ప్రకటించింది.ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నేత, దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడిగా అనేక సంవత్సరాలు పనిచేసిన సుమిత్ వాంఖడే బరిలోకి దిన్నారు. 2019లోనూ ఫడ్నవీస్ మాజీ పీఏ అభిమన్యు పవార్‌కు అవుసా నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపొందారు.ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ముంబై వెస్ట్‌లోని వెర్సోవా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్, లాతూర్ సిటీ నుంచి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్, పాల్ఘర్ జిల్లాలోని వాసాయి స్థానం నుంచి స్నేహ దుబే, వాషిమ్‌లోని కరంజా నుంచి సాయి ప్రకాష్ దహకే ఉన్నారు.ఘట్కోపర్ ఈస్ట్ నుంచి పరాగ్ షా, బోరివాలి నుంచి సంజయ్ ఉపాధ్యాయ్‌ను ముంబై నుంచి పోటీకి నిలిపింది. కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేపై స్థానిక నేత అవినాష్ బ్రహ్మాంకర్ను బీజేపీ బరిలోకి దించింది. అస్తి స్థానం నుంచి సురేష్ ధాస్, మల్షిరాస్ నుంచి సత్పుటే, డెగ్లూర్ నుంచి జితేష్ అంతపుర్కర్, సావ్నర్ నుంచి ఆశిష్ దేశ్ ముఖ్ వంటి ప్రముఖ నేతలు బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గత వారం విడుదల చేసిన తొలి జాబితాలో అత్యధికంగా 99 మంది అభ్యర్థులున్నారు. శనివారం రెండో జాబితాలో 22 మంది అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. తాజా వాటితో కలిపి మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న జార్ఖండ్‌తోపాటు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. -
18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ మరో 11 స్థానాలతో మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడో జాబితాతో కలిపి మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పోటీచేసే మొత్తం 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ పార్టీ పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల్లో కాకినాడకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
టీడీపీ మూడో జాబితా విడుదల
సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ మరో 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు ఆ పార్టీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్ల యింది. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీచేయాల్సి వుండగా ఇంకా ఐదు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. అలాగే, పొత్తులో 8 ఎంపీ స్థానాలు వదులుకోవడంతో 17 స్థానాలకుగానూ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 4 స్థానాలకు ఖరారు చేయాల్సి వుంది. మూడో జాబితా ఇలా.. ఎమ్మెల్యే అభ్యర్థులు.. పలాస – గౌతు శిరీష పాతపట్నం – మామిడి గోవిందరావు శ్రీకాకుళం – గొండు శంకర్ ఎస్.కోట – కోళ్ల లలితకుమారి కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం – అయితాబత్తుల ఆనందరావు పెనమలూరు – బోడె ప్రసాద్ మైలవరం – వసంత కృష్ణప్రసాద్ నరసరావుపేట – డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు చీరాల – ఎం. మాలకొండయ్య యాదవ్ సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం – మాత్కుమిల్లి భరత్ అమలాపురం – గంటి హరీష్ మాధుర్ ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్ విజయవాడ – కేశినేని శివనాథ్ (చిన్ని) గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల – తెన్నేటి కృష్ణప్రసాద్ నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాదరావు కర్నూలు – బస్తిపాటి నాగరాజు నంద్యాల – బైరెడ్డి శబరి హిందూపురం – బీకే పార్థసారథి -
ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు
సాక్షి, అమరావతి : తెలుగుదేశంలో పార్టీలో అనుకున్నదే జరుగుతోంది. ధనస్వామ్యానికే చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. డబ్బున్నవారికే సీట్లు కట్టబెడుతున్నారు. తాజాగా.. శుక్రవారం ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం తేలిపోయింది. ఉదా.. విజయవాడ, గుంటూరు స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి ఎంపీ సీట్లు కేటాయించారు. నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. ఇక బీజేపీ కోరుతున్న విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ రెండవ అల్లుడు, లోకేశ్ తోడల్లుడు అయిన మోత్కుమిల్లి భరత్‌కు కట్టబెట్టారు. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. కడప నేతకు ఏలూరు సీటు.. ఏలూరు ఎంపీ సీటును మాత్రం అనూహ్యంగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కి కేటాయించారు. కడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేత పుట్టా సుధాకర్ కుమారుడైన మహేష్‌కి ఏలూరు సీటు కట్టబెట్టడంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆ సీటును ఆశించి అక్కడ పనిచేస్తున్న గోపాల్ యాదవ్, మాజీ ఎంపీ మాగంటి బాబులను పక్కనపెట్టి మహేష్‌కి ఇవ్వడమేమిటని అక్కడి నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు.. బాపట్ల ఎంపీ సీటును ఆశ్చర్యకరంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కి ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయంతో టీడీపీ శ్రేణులే అవాక్కయ్యాయి. ఆయన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి కావడంతోపాటు పుట్టి పెరిగింది అంతా తెలంగాణలోనే. అలాంటి వ్యక్తికి చంద్రబాబు ఏపీలో సీటు ఇచ్చారు. బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరక్క చంద్రబాబు చాలారోజులపాటు అన్వేషణ కొనసాగించారు. ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావుకు ఇవ్వాలని చూసినా ఆయనకు చిత్తూరు సీటు ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్‌కు బాపట్ల సీటు ఇచ్చారు. నిజానికి.. వరంగల్ ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున పోటీచేసేందుకు కృష్ణప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనకు చంద్రబాబు అనూహ్యంగా ఏపీలో సీటు ఇవ్వడం గమనార్హం. సోమిరెడ్డికే సర్వేపల్లి టికెట్.. అలాగే, నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో పలువురి కొత్త నేతల పేర్లు తెరపైకి తెచ్చి హడావుడి చేసినా చివరికి అక్కడి ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్బాబుకే ఆ సీటు కేటాయించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లిని ఎట్టకేలకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు. ఆ సీట్లో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డి స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో చేరిన తర్వాత సోమిరెడ్డి స్థానంలో మరొకరికి ఇచ్చేలా రాజకీయం చేశారు. ఒక దశలో సోమిరెడ్డి కాకపోతే ఆయన కుటుంబంలో ఎవరికైనా సీటు ఇవ్వాలని చూశారు. కానీ, చివరికి సోమిరెడ్డికే సీటు ఖరారుచేశారు. ధర్మవరం, హిందూపురం.. గరం గరం.. ఇక ధర్మవరం సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ఓ వైపు పరిటాల శ్రీరాం, మరోవైపు వరదాపురం సూరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. హిందూపురం ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంతో ధర్మవరం సీటు బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బీకే పార్థసారథి పేరు ఖరారు చేయడంతో నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ ఆశలు ఆవిరయ్యాయి. ఎంపీ టికెట్ తనదేనని ప్రచారం చేస్తున్న బీజేపీ నేత పరిపూర్ణానందస్వామి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అలాగే, వైఎస్సార్ జిల్లా కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి వాసు కారణంగానే టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. వరుసగా మూడుసార్లు ఓడినోళ్లకు ఎన్నికల్లో టికెట్ లేదని గతంలో నారా లోకేశ్ ప్రకటించినా నెల్లూరు జిల్లా సర్వేపల్లి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఊరించి ఉసూరుమనిపించారు. దేవినేని ఉమాకు షాక్.. వసంతకే మైలవరం టికెట్ మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివాదంగా మారిన పెనమలూరు, మైలవరం అసెంబ్లీ సీట్లకు బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ పేర్లను ఖరారుచేశారు. మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు గట్టిగా పోటీపడ్డారు. ఈ స్థానాన్ని నిలుపుకునేందుకు దేవినేని ఉమా గట్టిగా పట్టుబట్టినా ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు చెబుతున్నారు. మైలవరం టికెట్‌ను ఫిరాయింపు నేతకు ఇస్తున్న నేపథ్యంలో పెనమలూరు సీటుకు దేవినేని ఉమా పేరును పరిగణలోకి తీసుకుని అక్కడికి పంపుతున్నట్లు హడావుడి చేశారు. అక్కడి ఇన్‌ఛార్జి బోడె ప్రసాద్‌ను పక్కనపెడుతున్నట్లు హంగామా చేసినా చివరికి ఆయనకే సీటు ఇచ్చారు. దీనివెనుకా భారీగా డబ్బు దండుకునే వ్యూహం అమలైనట్లు తెలుస్తోంది. ఆ వ్యూహంలో చిక్కుకున్న బోడె ప్రసాద్ ఎలాగోలా టీడీపీ పెద్దలను సంతృప్తిపరచడంతో ఆయనకే సీటు ఖరారుచేశారు. దీంతో.. రెండు స్థానాల్లో ఏదీ దక్కక టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభాసుపాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఉమాను అన్ని రకాలుగా వాడుకున్న చంద్రబాబు చివరికి కరివేపాకులా పక్కన పడేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ తోపాటు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొంటారు. సీఈసీ భేటీలో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన రెండు జాబితాల్లో తెలంగాణలోని 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మూడో జాబితాలో తెలంగాణలోని రెండు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు సీట్లకు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పది రాష్ట్రాలకు చెందిన కోర్ కమిటీ నేతలతో జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లపై చర్చించి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. -
ప్రజాభిప్రాయం.. సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: జన బలమే గీటు రాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. యువతకు ప్రాధాన్యమిస్తూ 15 శాసనసభ స్థానాలకు, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో జాబితాను ఖరారు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో గురువారం రాత్రి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు.. ఈ నెల 2న 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేశారు. మొత్తం మూడు జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్(బీసీ)ను నియమించారు. మంత్రి గుమ్మనూరి జయరాం(బీసీ)ను కర్నూలు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ స్థానం(ఎస్సీ) సమన్వయకర్తగా, విజయవాడ లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా కేశినేని నానిలను నియమించారు. బీసీలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట మూడు జాబితాల్లో 50 శాసనసభ స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే.. సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తమ్మీద 50 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో.. ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13 (రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 9 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ ఉన్నారు. పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు, , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలికి సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీఐఐసీ ౖచైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్‌కుమార్‌ను పూతలపట్టు, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. జెడ్పీ చైర్మన్లకు అవకాశం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియ విజయను ఇచ్చాపురం శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా, చిప్పగిరి జెడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. క్లీన్ స్వీప్ లక్ష్యం సీఎం వైఎస్ జగన్ గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూ.2.45 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్లు.. వెరసి రూ.4.12 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే.. అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం. గత 56 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుట కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఇంటా చేసిన మంచిని ప్రజలకు చెప్పి.. జనంతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరించడం ద్వారా వారి మనసులు చూరగొని.. మరింత మంచి చేయడానికి ప్రజల ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. ప్రజలతో మమేకం కాకుండా.. జనం మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం వైఎస్ జగన్ తేల్చిచెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు అసంతృప్తుల కాక
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాపై కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. జాబితాలో పేర్లు లేని ఆశావహులు, వారి అనుచరులు ఆందోళనలు చేపట్టారు. అటు గాంధీభవన్, ఇటు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఈ ఆందోళనలు జరిగాయి. జి చిన్నారెడ్డి (వనపర్తి), సంజీవరెడ్డి (నారాయణఖేడ్), కాట శ్రీనివాస్‌గౌడ్ (పటాన్చెరు), బెల్లయ్య నాయక్ (డోర్నకల్), మానవతా రాయ్ (సత్తుపల్లి)లు తమ అనుచరులతో కలిసి, వ్యక్తిగతంగా తమ నిరసనలు పార్టీ అధిష్టానానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాం«దీభవన్‌లోని ప్రధాన గేటులో ఒకదానికి తాళం వేయగా, జూబ్లీహిల్స్‌లో రేవంత్ నివాసానికి వెళ్లే నాలుగువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. చిన్నారెడ్డి అనుచరుల నిరసన వనపర్తి టికెట్ ఆశించిన చిన్నారెడ్డి అనుచరులు ఉదయం రేవంత్ ఇంటివద్ద ఆందోళనకు దిగారు. తమ నాయకుడికి ఇచ్చిన టికెట్‌ను మార్చి ఇతరులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వినతిపత్రం సమర్పించారు. రేవంత్ మాట్లాడుతూ చిన్నారెడ్డి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి గాందీభవన్‌కు చేరుకున్న చిన్నారెడ్డి అనుచరులు మెట్లపై కూర్చొని తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో చిన్నారెడ్డి జోక్యం చేసుకొని వారిని వారించారు. ఇలావుండగా వనపర్తి టికెట్ దక్కించుకున్న మేఘారెడ్డికి బీ ఫాం అందింది. మంగళవారం గాందీభవన్‌లో మేఘారెడ్డి సోదరుడు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి బీ ఫాం అందజేశారు. కాట వర్గీయుల మండిపాటు పటాన్చెరు టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు సోమవారం అర్ధరాత్రే స్థానికంగా నిరసనలకు దిగారు. పార్టీ జెండాలను దహనం చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఇంటిని, గాం«దీభవన్‌ను ముట్టడించారు. రేవంత్ ఆలంపూర్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఆయన నివాసం వద్దకు వచ్చిన శ్రీనివాస్‌గౌడ్, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలో కొత్తగా చేరిన నీలం మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించారు. అనంతరం వారు గాందీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. పారాచూట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు రామచంద్రాపురంలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పటాన్చెరు టికెట్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. అధినాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ టికెట్ విషయంలో భరోసా ఆందోళన విరమించారు. కాగా నారాయణఖేడ్ టికెట్ ఆశించి భంగపడిన సంజీవరెడ్డి అనుచరులు కూడా గాందీభవన్ వేదికగా ఆందోళనకు దిగారు. ఖేడ్‌లోనూ నిరసన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యకూ వెనుకాడను తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ విభాగం చైర్మన్‌గా ఉన్న తనకు టికెట్ కేటాయించకపోవడంపై బెల్లయ్య నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో ఎక్కడా టికెట్ ఇవ్వకుండా మోసం చేశారంటూ గాంధీ బొమ్మ ఎదుట దీక్షకు దిగారు. తనకు అవకాశం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడనని హెచ్చరించడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. బరిలోకి దిగేది ఖాయం: మానవతారాయ్ సత్తుపల్లి విషయంలో నిర్ణయాన్ని 24 గంటల్లోగా మార్చుకొని తనకు పార్టీ బీఫాం ఇవ్వకపోతే 9, 10 తేదీల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కె మానవతారాయ్ హెచ్చరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. భీం భరత్‌కు ఎట్టకేలకు బీ ఫాం చేవెళ్ల టికెట్‌ను భీం భరత్‌కు ఇస్తామని ప్రకటించిన అధిష్టానం బీ ఫాం మాత్రం ఇవ్వలేదు. దీంతో రెండు మూడురోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఆయన మంగళవారం పార్టీ పెద్దలను కలిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే బీఫాం అందజేయడతో గందరగోళానికి తెరపడింది. దామోదర వర్సెస్ జగ్గారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి మధ్య విభేదాలు పొడ చూపాయి. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కడంలో తన ప్రమేయం ఉందంటూ కాట శ్రీనివాస్‌గౌడ్ కుటుంబ సభ్యులతో రాజనర్సింహ తనను బద్నాం చేయిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలే తప్ప వ్యక్తిగతంగా డ్యామేజీ చేసేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. మరోవైపు తన అనుచరులు కాట శ్రీనివాస్‌గౌడ్, సంజీవరెడ్డిలకు టికెట్లు దక్కకపోవడంపై రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తన నియోజకవర్గం మునిపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. -
16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుద లైంది. 16 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థు లను ప్రకటించింది. ఇందులో మూడు ఎస్సీ, ఐదు ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కామారెడ్డి నుంచీ సీఎం కేసీఆర్‌పై బరిలో దింపారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన జి.వివేకానందకు చెన్నూ రు టికెట్ ఇచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సు వాడ నుంచి, షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ నారాయణ్‌ఖేడ్ నుంచి, నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు నుంచి పోటీ చేయనున్నారు. తాజా జాబితాలో 14 స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించగా, మరో రెండు స్థానాలకు గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చారు. గతంలో బోథ్ నియోజకవర్గానికి వన్నెల అశోక్ పేరును ప్రకటించగా, తాజాగా ఆ యన స్థానంలో ఆదె గజేందర్‌కు అవకాశం ఇచ్చింది. అలాగే వనపర్తికి గతంలో జిల్లెల చిన్నారెడ్డి పేరు ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. అనేక కసరత్తుల తర్వాత ఆయన స్థానంలో తుడి మేఘారెడ్డిని బరిలోకి దింపుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు జాబితాల్లో కలిపి మొత్తం 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. సీపీఐకి కొత్తగూడెం కేటాయించగా.. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ సీట్లను పెండింగ్‌లో ఉంచింది. ఒకవేళ సీపీఎంతో చర్చలు సఫలం అయితే వారికి మిర్యాలగూడ స్థానాన్ని కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మరో 25 మందితో బీఎస్పీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మూ డో విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ శనివారం ప్రకటించారు. 25 మందితో కూడిన ఈ జాబితాతో ఇప్పటి వరకు బీఎస్పీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 88కు చేరింది. ప్రజల మధ్యన ఉండే వారినే బీఎస్పీ అభ్యర్థులుగా నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిర్పూర్ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నానని, సిర్పూర్‌ను ఆంధ్ర వలస దారుని పాలన నుంచి విముక్తి కల్పించడమే తన ధ్యేయమన్నారు. 10న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి 2018 శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసిన సీఎం కేసీఆర్ అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆర్టీఐ కింద గజ్వేల్ ఆర్డీవో నుంచి తాము తీసుకున్న వివరాల్లో కేసీఆర్ ఆస్తుల వివరాలు లేవని తెలిపారు. ఆస్తుల వివరాలు వెల్లడించని నామినేషన్‌ను ఆమోదించిన అప్పటి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌ను మళ్లీ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై తాము మొదటి నుంచీ హెచ్చరిస్తున్నామనీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల భద్రతపై కూడా తమకు అనుమానాలున్నాయని, జనావాసాల మధ్య కట్టిన ఈ ప్రాజెక్టులకు ఏమైనా జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పవని ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. -
బీసీన్ మారుస్తుందా?
కె. రాహుల్: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ద్వారా బీసీ ఎజెండాతో బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్న విషయం స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో బీసీ సీఎంపై కూడా పార్టీ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో బీజేపీకి ఇప్పుడు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. కచ్చితమైన వ్యూహంతో ముందుకు.. కచ్చితమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంలో భాగంగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం అంత బలంగా ఎత్తుకోని బీసీ నినాదాన్ని బీజేపీ తలకెత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. తాజాగా ఈ నిర్ణయాన్ని సూర్యాపేట సభలో అమిత్‌షా ప్రకటించడానికి ముందే సంస్థాగతంగా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చించి, ముఖ్యనేతలు, రాష్ట్రకార్యవర్గం, కౌన్సిల్ సభ్యుల స్థాయిలో అభిప్రాయసేకరణ చేపట్టారు. ఈ భేటీల్లోనూ రెడ్డి, ఇతర సామాజికవర్గనేతల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో బీసీ ఎజెండాతోనే ముందుకెళితేనే మంచి ఫలితాలు సాధించవచ్చుననే నిశ్చితాభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో 54 శాతం వరకు బీసీ వర్గాల వారు ఉన్నారనే అంచనాల నేపథ్యంలో అధికశాతం బీసీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడేందుకు బీసీ సీఎం నినాదం పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీ ఎజెండాతో ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించింది. విస్తృత ప్రచారంతో... వారిని చేరుకోవడమే కీలకం 2014 అసెంబీ ఎన్నికల్లో టీడీపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నా అది అస్సలు వర్కవుట్ కాలేదు. సీనియర్‌నేత టి దేవేందర్‌గౌడ్ కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా ఈ వర్గాల నుంచి పెద్దగా మద్దతు కూడగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎంబీసీ కులాల పెద్దలు, నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిని ఎవరన్నది కూడా త్వరలో ప్రకటించే యోచనలో బీజేపీ ఉంది. 40కి పైగా సీట్లు ఇచ్చేలా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40కి పైగానే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం సీట్లలో మూడోవంతుకు పైగానే సీట్లు ఇచ్చామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తొలిజాబితాను 52 మంది అభ్యర్థులతో విడుదల చేయగా, అందులో బీసీవర్గాలకు చెందిన వారికి 19 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో ఒకరికి, తాజాగా 35 మందితో మూడో జాబితాను ప్రకటించగా అందులో 13 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే.. ప్రకటించిన 88 సీట్లలో 32 మంది బీసీ వర్గాలకు వచ్చారు. ఇంకా 31 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, జనసేనకు 11 సీట్లు కేటాయిస్తే.. మిగిలిన 20 సీట్లలో పదిదాకా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఆయా కులాల వారీగా చూస్తే ముదిరాజ్–గంగపుత్రులు కలిపి (45 లక్షలు) యాదవ (35 లక్షలు), గౌడ (28 లక్షలు), మున్నూరుకాపు (22 లక్షలు), పద్మశాలి (18 లక్షలు),రజక (12 లక్షలు ),వడ్డెర (10 లక్షలు), ఇతర ఎంబీసీ కులాలకు చెందిన వారు 40 లక్షలదాకా ఉండొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా కులాల వారీగా టికెట్లు కేటాయిపునకు కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పథకాలతో.. జాతీయస్థాయిలో బీజేపీ తీసుకున్న ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో బీసీలు, ఎంబీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తే మంచి ఫలితాలను సాధించొచ్చునని భావిస్తున్నారు. మోదీ హయాంలో ఆయా బీసీవర్గాలకు అందిన ప్రయోజనాలను వివరించనున్నారు. ఎంబీసీ వర్గానికి చెందిన మోదీని బీజేపీ తొలిసారిగా ప్రధానిగా నియమించడం, కేంద్ర కేబినెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది వెనుకబడిన తరగతుల వారి నియామకం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి కూడా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం... ఈ పరిణామాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం, ఆనవాయితీ బీజేపీలో లేకపోయినా తెలంగాణలో ఈ సారి ముందుగానే బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. -
Telangana Elections 2023: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
పరామర్శకైనా పనికిరామా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న క్రమంలో బీజేపీలో టికెట్ల చిచ్చు రగులుతోంది. రెండు జాబితాల్లో కలిపి 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాక, నవంబర్ 1న మూడో జాబితా వెలువడనున్న నేపథ్యంలో బీజేపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురిలో అసంతృప్తి వ్యక్త మౌతోంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో కనీసం 60–70 చోట్లయినా సీరియస్‌గా టికెట్ ఆశిస్తున్న వారు ఇద్దరు, ముగ్గురున్నప్పుడు అభ్యర్థిత్వం ఖరా రుకాని వారిని పిలిచి మాట్లాడే పరిస్థితి పార్టీలో లేకపోవడాన్ని తప్పుబడు తున్నారు. గతంలో టికెట్ రాని వారికి నచ్చజెప్పి పార్టీ కోసం పని చేసేలా ఒప్పించిన పరిస్థితులుండగా ఇప్పుడు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు పట్టించుకోక పోవడం సరికాదని మండిపడుతున్నారు. కనీసం బుజ్జగింపులు, నచ్చజెప్ప డాలు వంటి వాటికి కూడా తాము నోచుకోలేదని పలువురు బీజేపీ నేతలు వాపోతున్నారు. పరామర్శకైనా తాము పని కిరామా అని ఆవేదన చెందుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ విజయం సాధ్యమనే విష యాన్ని నాయకులు విస్మరించారని అంటున్నారు. గుర్తింపుపై భరోసా ఏదీ? ఇప్పుడు వివిధ సమీకరణల మధ్య టికెట్ ఇవ్వలేక పోయామని, భవిష్యత్‌లో గుర్తింపు లభిస్తుందని భరోసా కల్పించకపోవడంపైనా పలువురు కమలనాథులు రుసరుసలాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టులు ఇస్తామనే హామీ కూడా ఇవ్వకపోవడం దేనికి సంకేతమని అంటున్నారు. అలాంటప్పుడు ఆశావహుల నుంచి దరఖాస్తులు కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని నాయకత్వం కోరడంతో రికార్డు స్థాయిలో 6,003 దరఖాస్తులు వచ్చాయి. వారిలో తొలి జాబితాలో టికెట్లు దక్కని వారిని పార్టీపరంగా అనునయించే ప్రయత్నమేదైనా జరిగిందా అని నిలదీస్తున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి వెంటనే అవకాశం కల్పించి, ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాజీనామా చేస్తానని ప్రకటించినా... ముథోల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజీనామా చేస్తానని ప్రకటించాక కూడా ఎవరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగు తోంది. తొలిజాబితాలో తనకు ఆందోల్ టికెట్‌ను ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి బాబూ మోహన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేశారు. ఏదైనా భరోసా దొరుకుతుందేమోనని ముఖ్యనేతలకు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆయన వాపోయారు. వరంగల్(పశ్చిమ) నుంచి రావు పద్మకు టికెట్ కేటాయించడంతో... టికెట్ ఆశించి భంగపడిన అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి రెబెల్‌గా పోటీచేస్తానని ప్రకటించారు. అయినా ఆయనను నచ్చజెప్పేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా పరిస్థితులు మరికొన్ని నియోజక వర్గాల్లోనూ ఉన్నాయి. తదుపరి జాబితా ప్రకటించే సమయంలోనైనా టికెట్లు ఆశిస్తున్న ముఖ్యనే తలతో పార్టీ పెద్దలు మాట్లాడాలని ఓ ముఖ్యనేత సాక్షితో చెప్పారు. -
Karnataka: బీజేపీ మూడో జాబితా విడుదల.. శెట్టర్ స్థానం ఆయనకే!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ పార్టీలో కల్లోలం మరింత పెరిగింది. ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొత్త ముఖాలకు చోటిచ్చే ప్రయత్నంలో పలువురు సీనియర్లు, సిట్టింగ్‌లకు మొండి చేయి చూపడంతో ఒక్కొకరుగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 212 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మూడో జాబితాను సోమవారం విడుదల చేసింది. చివరి విడతలో భాగంగా పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగ్థాన్, సేదన్, కొప్పల్, రోణ్, హుబ్లీ ధర్వాడ్ సెంట్రల్, హగరిబొమ్మనహళ్లి, హెబ్బాల్, గోవిందరాజ్ నగర్, మహదేవపుర, కృష్ణరాజ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పోటీ చేయాలనుకున్న హుబ్బళి సెంట్రల్ నియోజవర్గం నుంచి బీజేపీ జనరల్ సెక్రటరీ మహేష్ తెంగినాకైకి చోటు కల్పించింది. కాగా హుబ్బలి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ శెట్టర్.. ఈసారి కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాషాయ దళాన్ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా మహదేవపుర సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ లింబావలికి బీజేపీ హ్యండిచ్చింది. ఈ స్థానంలో ఆయన సతీమణి మంజులా పోటీలోకి దింపింది.. కొప్పల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని బెదిరిస్తున్న కారడి సంగన్న అమరప్పకు కూడా పార్టీ టిక్కెట్టు దక్కలేదు. ఆయన కుమార్తె మంజుల అమరేష్‌కు కొప్పల్ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు గానూ బీజేపీ 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 189 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేయగా..రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా చివరి విడత విడుదల చేసింది. ఇక మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. -
కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
జనసేన పార్టీ మూడో జాబితా విడుదల
సాక్షి. అమరావతి: జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడో జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం అర్ధరాత్రి రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో ఒక లోక్‌సభ అభ్యర్థిని, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేస్తు జాబితాను విడుదల చేశారు. రెండో జాబితాలో శ్రీ షేక్ రియాజ్ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించగా.. మూడో జాబితాలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయి చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారన్నారు. లోక్ సభ అభ్యర్థి ఒంగోలు - బెల్లంకొండ సాయిబాబు శాసనసభ అభ్యర్థుల జాబితా టెక్కలి - కణితి కిరణ్ కుమార్ పాలకొల్లు- గుణ్ణం నాగబాబు గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్ రెహ్మాన్ రేపల్లె - కమతం సాంబశివరావు చిలకలూరిపేట - శ్రీమతి మిరియాల రత్నకుమారి మాచర్ల - కె. రమాదేవి ఒంగోలు- షేక్ రియాజ్ మార్కాపురం - ఇమ్మడి కాశానాధ్ యాదవ్ గిద్దలూరు - బైరబోయి చంద్రశేఖర్ యాదవ్ పొద్దుటూరు - ఇంజా సోమశేఖర్ రెడ్డి నెల్లూరు అర్బన్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి మైదుకూరు- పందిటి మల్హోత్ర కదిరి - సాడగల రవికుమార్( వడ్డె రవిరాజు) -
16 మందితో ఆప్ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో విడత జాబితాను ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం 47 మంది అభ్యర్థులను ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర రాముగౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రాముగౌడ్ మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా పాలన తెలంగాణలో తీసుకురావడానికి ఆప్ కృషి చేస్తుందని తెలిపారు. సామాజిక సేవలో పాల్గొన్న వ్యక్తులకు, క్రిమినల్ నేపథ్యం లేనివారికే టికెట్ల కేటాయింపులో పార్టీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా నిజాం మనవడు రౌనత్ఖాన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ పాలన నచ్చి పార్టీలో చేరినట్లు రౌనత్‌ఖాన్ తెలిపారు. అనంతరం రౌనత్‌ఖాన్ చేతుల మీదుగా పార్టీ అభ్యర్థులకు బీ–ఫామ్‌లను అందించారు. -
20 మందితో బీజేపీ మూడో జాబితా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో 20 మంది అభ్యర్థులను జాబితాను భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాశ్‌నడ్డా ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 86 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది. -
మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం కాంగ్రెస్ వెల్లడించింది. ఫిబ్రవరి 4న జరగనున్న ఎన్నికలకు గాను ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో 77 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మధుసుధన్ మిస్త్రీ ప్రకటించిన మూడో జాబితాలో ఎక్కువగా అకాలీదళ్ నుంచి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభించింది. అకాలీదళ్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాజ్విందర్ కౌర్, కమల్జిత్ సింగ్, దేవిందర్ గుబయ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 117 సీట్లకు గాను తాజా జాబితాతో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా 100కు చేరింది. మిగిలిన 17 సీట్ల కోసం భారీగా లాబీయింగ్ జరుగుతుందని సమాచారం.