సాక్షి. అమరావతి: జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడో జాబితాను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం అర్ధరాత్రి రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో ఒక లోక్‌సభ అభ్యర్థిని, 13 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్పు చేస్తు జాబితాను విడుదల చేశారు. రెండో జాబితాలో శ్రీ షేక్ రియాజ్ గిద్దలూరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించగా.. మూడో జాబితాలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయి చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారన్నారు.
లోక్ సభ అభ్యర్థి
ఒంగోలు - బెల్లంకొండ సాయిబాబు
శాసనసభ అభ్యర్థుల జాబితా
టెక్కలి - కణితి కిరణ్ కుమార్
పాలకొల్లు- గుణ్ణం నాగబాబు
గుంటూరు ఈస్ట్ - షేక్ జియా ఉర్ రెహ్మాన్
రేపల్లె - కమతం సాంబశివరావు
చిలకలూరిపేట - శ్రీమతి మిరియాల రత్నకుమారి
మాచర్ల - కె. రమాదేవి
ఒంగోలు- షేక్ రియాజ్
మార్కాపురం - ఇమ్మడి కాశానాధ్ యాదవ్
గిద్దలూరు - బైరబోయి చంద్రశేఖర్ యాదవ్
పొద్దుటూరు - ఇంజా సోమశేఖర్ రెడ్డి
నెల్లూరు అర్బన్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి
మైదుకూరు- పందిటి మల్హోత్ర
కదిరి - సాడగల రవికుమార్( వడ్డె రవిరాజు)
Comments
Please login to add a commentAdd a comment