
జంగారెడ్డిగూడెం: జనసేన పార్టీ నాయకులు టిక్కెట్‌లు అమ్ముకుంటున్నారని, అవినీతిపరులకు టిక్కెట్‌లు కేటాయిస్తున్నారని జనసేన పార్టీ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కమిటీ ఏపీ, తెలంగాణ వైస్ ఛైర్మన్ దువ్వెల సృజన ఆరోపించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె నివాస గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం అసెంబ్లీ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో రూ.2 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అతనికి టిక్కెట్ ఇచ్చారని ఆరోపించారు.
జనసేన అభివృద్ధికి కష్టపడిన తనను కాదని, కరాటం సాయి అనే అవినీతి పరుడికి టిక్కెట్ ఇప్పించారని ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రశ్నిస్తే టికెట్‌కు రూ.50 లక్షలు అడిగారని పేర్కొన్నారు. డమ్మీ అభ్యర్థిని తెర మీదకు తీసుకురావడానికి గల కారణమేమిటని ప్రశ్నించారు. కష్టపడి పోలవరంలో జనసేన పార్టీని నిలబెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌కు చెప్పటానికి 20 రోజుల నుంచి పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్థానిక నాయకులు అవకాశం ఇవ్వలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment