
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవినే ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం తరఫున తిరుపతి, పాలకొల్లు నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడు పవన్ కూడా రెండు చోట్ల నుంచి బరిలో దిగబోతున్నారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారని జనసేన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
విశాఖ ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ
జనసేన పార్టీ మంగళవారం మరో జాబితా విడుదల చేసింది. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖపట్నం ఉత్తరం నుంచి పసుపులేటి ఉషా కిరణ్, విశాఖపట్నం దక్షిణం నుంచి గంపల గిరిధర్, విశాఖపట్నం తూర్పు నుంచి కోన తాతారావు, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం నుంచి టి.సి.వరుణ్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment