18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు | Finalization of Jana Sena candidates for 18 seats | Sakshi
Sakshi News home page

18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు

Published Mon, Mar 25 2024 3:20 AM | Last Updated on Mon, Mar 25 2024 11:54 AM

Finalization of Jana Sena candidates for 18 seats - Sakshi

అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్‌ స్థానాలు పెండింగ్‌

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ మరో 11 స్థానా­లతో మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థు­లను ప్రకటించగా.. రెండో జాబితాలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూ­డో జాబితాతో కలిపి మొత్తంగా 18 స్థానాలకు అ­భ్య­ర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జనసేన పోటీచేసే మొత్తం 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానా­లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ పా­ర్టీ పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల్లో కాకినాడకు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అభ్యర్థిత్వా­న్ని ఇటీవలే ఖరారు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement