46 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ | BJP releases list of 46 candidates for Bihar polls | Sakshi
Sakshi News home page

46 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Oct 12 2020 3:53 AM | Updated on Oct 12 2020 3:53 AM

BJP releases list of 46 candidates for Bihar polls - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మరో 46 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. దీంతో బీజేపీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఈ అభ్యర్థులతో పాటు పలు రాష్ట్రాల్లో జరగనున్న 16 స్థానాల అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. బిహార్‌ కోసం ప్రకటించిన తాజా లిస్టులో రాష్ట్రమంత్రి నంద కిషోర్‌ యాదవ్, నితీశ్‌ మిశ్రా వంటి ప్రముఖులు ఉన్నారు. బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్‌ఏఎం పార్టీలు కలసి  పొత్తు గా ఏర్పడి, బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేస్తు న్నాయి. మొత్తం 243 స్థానాలకుగానూ బీజేపీ 110, జేడీయూ 115, వీఐపీ 11, హెచ్‌ఏఎం 7 సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాగా మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అసెంబ్లీ సీట్లు కేటాయించి బరిలో దించవద్దని నిర్భయ జ్యోతి ట్రస్టు బిహార్‌లోని రాజకీయ పార్టీలను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement