కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖైదీల పరారీపై హోంమంత్రి సీరియస్
Published Tue, Dec 29 2015 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM
కడప: కడప కేంద్ర కారాగారం నుంచి ఖైదీల పరారీ ఘటనపై ఏపీ హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరో వైపు పరారైన ఖైదీల కోసం ప్రత్యేక బృందాల గాలింపు కొనసాగుతోంది.
కాగా నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు సోమవారం సాయంత్రం అధికారుల కళ్లుగప్పి తప్పించుకు పోయారు. సాయంత్రం సమయంలో కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పైకి ఎక్కారు. గోడపై ఉన్న విద్యుత్ తీగలపై గోనె సంచి పట్టలు వేసుకుని అవతలి వైపు దూకి పరారయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రవి, దేవ, అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్ర, కర్నూలు జిల్లాకు హనుమంతు అనే జీవిత ఖైదీలు పరారైనట్టు గుర్తించారు.
Advertisement
Advertisement