
నిర్మాత గాజుల నాగేశ్వరరావు కన్నుమూత
నిర్మాత గాజుల నాగేశ్వరరావు (50) ఆదివారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాఘవేంద్ర సినీచిత్ర పతాకంపై ‘సిబీఐ అరెస్ట్ వారెంట్, సెంట్రల్ జైల్’ అనే చిత్రాలను నిర్మించారు నాగేశ్వరరావు. తెలుగు చలన చిత్ర నిర్మాతల సంఘం ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేసింది.