
లక్నో : ప్రయాగరాజ్‌లోని సెంట్రల్ జైల్‌లో ఖైదీల విశృంఖల ప్రవర్తన వెలుగుచూడటంతో యూపీ పోలీసులు సదరు జైలులో దాడులు చేపట్టారు. ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలులో పోలీసులు జరిపిన దాడుల్లో సిగరెట్లు, మొబైల్ ఫోన్లు, లైటర్లు, కత్తులు వంటి మారణాయుధాలు సైతం లభ్యమవడం కలకలం రేపింది. మూడు గంటల పాటు పోలీసులు జైలులో చేపట్టిన తనిఖీల్లో పలు నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ జైలులో కొద్ది రోజుల కిందట ఖైదీలు పార్టీ చేసుకున్న సందర్భంలో వారి విచ్చలవిడి ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
మద్యం సేవించిన ఖైదీలు కత్తులతో వీరంగం వేసిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తనిఖీలు చేశారు. కాగా గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్‌ను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్‌కు బదిలీ చేయడంతో నేరస్తులైన షార్ప్ షూటర్లు ఉదయ్ యాదవ్, రనూ, రాజ్ కుమార్, గదూ పశి వంటి ఖైదీలు సెలబ్రేట్ చేసుకునే క్రమంలో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు వెలుగు చూశాయి. ఉన్నావ్ జైలులోనూ ఖైదీలు వీరంగం వేసిన దృశ్యాలు కలకలం రేపాయి. జైలు బ్యారక్‌ల్లోనే వారు మద్యం సేవించి పార్టీ చేసుకున్న దృశ్యాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment