ఈ ఏడాదీ క్షమాభిక్ష లేనట్టే?
-
నిరుత్సాహంలో జీవిత ఖైదీలు
-
అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన
రిపబ్లిక్ డే సందర్భంగా సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది ఖైదీల విడుదల లేనట్టేననిS జైల్ వర్గాల పేర్కొంటున్నాయి. గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో 110 మంది పురుష ఖైదీలు, 14 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వం క్షమా భిక్ష ప్రసాదిస్తే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి కనీసం 100 మందికి పైగా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉండేది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఖైదీల కుటుంబాలకు నిరాశే మిగిలింది.
– రాజమహేంద్రవరం క్రైం
సాధారణంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తే కనీసం 90 రోజుల సమయం పడుతుందని జైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలకు సంబంధించిన నియమ నిబంధనలు వివరిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుంది. దాని ప్రకారం జైల్ అధికారులు ఖైదీల నేర వివరాలు, శిక్ష అనుభవించిన రోజులు, క్షమాభిక్షకు ఉన్న అర్హత, తదితర వివరాలు ఆధారంగా ఖైదీల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను ఐదు అంచలుగా పరిశీలించి చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి పంపుతారు. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం 90 రోజుల సమయం అవసరమని జైలు వర్గాలు చెబుతున్నాయి. అయితే రిపబ్లిక్ డేకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఈ ఏడాదికి ఖైదీల క్షమాభిక్ష ప్రకటించే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
వరకట్న వేధింపుల కేసులోను, ప్రభుత్వ అధికారుల హత్యా కేసులలో శిక్ష పడి జైలుకు వచ్చిన ఖైదీలు ఏళ్లు తరబడి శిక్ష అనుభవిస్తున్నారు. సాధారణ కేసులలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ప్రభుత్వం ఈ రెండు కేసులలో మాత్రం ఇప్పటి వరకూ క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయలేదు. దీనితో 15 నుంచి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు. వయసు మళ్లడంతో అనారోగ్యంతో బాధపడుతున్నామని ఇప్పటికైనా తమకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకుంటున్నారు.
ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుంది. జీఓ విడుదల చేస్తే దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలలు పడుతుంది. రిపబ్లిక్ డే కే విడుదల చేయాలని నిబంధనలు లేవు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి విడుదలకు అవకాశం ఉది. ఇంకా 11 నెలలు ఉంది. ఈ ఏడాది
క్షమాభిక్ష లేదని చెప్పలేం.
– ఎం.చంద్రశేఖర్, కోస్తా రీజియ¯ŒS జైళ్ల శాఖ డీఐజీ