no release
-
రాజీవ్ హంతకుల విడుదలకు నో
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ వీరిని విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ జస్టిస్ గొగోయ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి సమర్పించింది. మాజీ ప్రధానితో పాటు 15 మంది అధికారుల్ని పొట్టనపెట్టుకున్న విదేశీయుల్ని విడుదల చేస్తే చాలా ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి వీబీ దూబే కోర్టుకు సమర్పించిన పత్రంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరస్తుల విడుదలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ హంతకులపై ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ అదే ఏడాది కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో ఏడుగురు ఉగ్రవాదుల్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా ఖైదీలను రాష్ట్రాలు విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాన్ని సవరించేదాక ఆగం దేశంలో ఆందోళనలు, ధర్నాలు, బంద్‌ల సందర్భంగా అల్లరిమూకలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. ఇలాంటి ఘటనల్ని నిరోధించేందుకు కేంద్రం చట్టాన్ని సవరించేంతవరకూ తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చట్ట సవరణ విషయంలో ప్రభుత్వానికి తాము మార్గదర్శకాలు జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఎక్కడైనా అల్లర్లు, ఆస్తుల విధ్వంసం జరిగితే సంబంధిత జిల్లా సూపరింటెండెంట్(ఎస్పీ)లను బాధ్యులుగా చేయాలని న్యాయస్థానానికి సూచించారు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలకు అధికారుల్ని బాధ్యులుగా చేయగానే అలాంటి అక్రమ కట్టడాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఆరుషీ తల్వార్, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో తల్వార్ దంపతుల్ని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. ► వచ్చే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ యంత్రాలను తనిఖీలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సుప్రీంను ఆశ్రయించారు. ► లైంగిక దాడి, అత్యాచారాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ఉన్న నిబంధనల్ని సమీక్షిస్తామని సుప్రీం తెలిపింది. మీడియాలో బాధిత మహిళలు, చిన్నారుల పేర్లు, ఫొటోల ప్రసారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. వసతి గృహాల్లో రేప్‌లు ఎప్పుడు ఆగుతాయి? దేశంలోని అనాథాశ్రమాలు, వసతి గృహాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు ఎప్పుడు ఆగుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీ, బిహార్‌లోని వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికలపై రేప్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. అనాథాశ్రమాల్లో లైంగికదాడులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. యూపీలోని పాల్గఢ్, ప్రతాప్‌గఢ్ బిహార్‌లోని ముజఫర్‌పూర్ వసతి గృహాల్లో మహిళలు, మైనర్ బాలికపై జరిగిన దారుణాలపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమికస్ క్యూరీగా పనిచేస్తున్న న్యాయవాది అపర్ణా భట్ స్పందిస్తూ.. దేశంలోని చిన్నారుల సంరక్షణా కేంద్రాలు(సీసీఐ)తో పాటు సోషల్ ఆడిట్ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుందని విన్నవించారు. అనంతరం కేంద్రం, హోంశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ న్యాయవాదులు కోర్టు ముందు హాజరుకాగా, ఇంతమంది ఎందుకొచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం స్త్రీ, శిశుసంక్షేమ శాఖ న్యాయవాది హాజరైతే సరిపోతుందని∙వ్యాఖ్యానించింది. -
ఈ ఏడాదీ క్షమాభిక్ష లేనట్టే?
నిరుత్సాహంలో జీవిత ఖైదీలు అనారోగ్యంతో బాధపడుతున్నామని ఆవేదన రిపబ్లిక్ డే సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది ఖైదీల విడుదల లేనట్టేననిS జైల్ వర్గాల పేర్కొంటున్నాయి. గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 110 మంది పురుష ఖైదీలు, 14 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు. ఈ ఏడాది ప్రభుత్వం క్షమా భిక్ష ప్రసాదిస్తే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి కనీసం 100 మందికి పైగా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉండేది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఖైదీల కుటుంబాలకు నిరాశే మిగిలింది. – రాజమహేంద్రవరం క్రైం సాధారణంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తే కనీసం 90 రోజుల సమయం పడుతుందని జైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. విడుదలకు సంబంధించిన నియమ నిబంధనలు వివరిస్తు ప్రభుత్వం జీఓ విడుదల చేస్తుంది. దాని ప్రకారం జైల్ అధికారులు ఖైదీల నేర వివరాలు, శిక్ష అనుభవించిన రోజులు, క్షమాభిక్షకు ఉన్న అర్హత, తదితర వివరాలు ఆధారంగా ఖైదీల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను ఐదు అంచలుగా పరిశీలించి చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి పంపుతారు. ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం 90 రోజుల సమయం అవసరమని జైలు వర్గాలు చెబుతున్నాయి. అయితే రిపబ్లిక్ డేకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఈ ఏడాదికి ఖైదీల క్షమాభిక్ష ప్రకటించే అవకాశం లేదని పేర్కొంటున్నారు. వరకట్న వేధింపుల కేసులోను, ప్రభుత్వ అధికారుల హత్యా కేసులలో శిక్ష పడి జైలుకు వచ్చిన ఖైదీలు ఏళ్లు తరబడి శిక్ష అనుభవిస్తున్నారు. సాధారణ కేసులలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్న ప్రభుత్వం ఈ రెండు కేసులలో మాత్రం ఇప్పటి వరకూ క్షమాభిక్ష ప్రసాదిస్తు జీఓ విడుదల చేయలేదు. దీనితో 15 నుంచి 20 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్నారు. వయసు మళ్లడంతో అనారోగ్యంతో బాధపడుతున్నామని ఇప్పటికైనా తమకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకుంటున్నారు. ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉంటుంది. జీఓ విడుదల చేస్తే దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలలు పడుతుంది. రిపబ్లిక్ డే కే విడుదల చేయాలని నిబంధనలు లేవు. రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతికి విడుదలకు అవకాశం ఉది. ఇంకా 11 నెలలు ఉంది. ఈ ఏడాది క్షమాభిక్ష లేదని చెప్పలేం. – ఎం.చంద్రశేఖర్, కోస్తా రీజియ¯ŒS జైళ్ల శాఖ డీఐజీ -
ఇంకెత కాలానికో ప్రోత్సాహకాలు ?
రాయవరం : విద్యార్థుల ‘ప్రతిభ’ను కూడా కూడా ప్రభుత్వం ప్రచారానికి వాడుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ట్యాబ్‌లు, నగదు పురస్కారం అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ వాటిని విద్యార్థులకు అందించలేదు. ప్రతిభ అవార్డులు పొందిన వారికి ట్యాబ్‌లు, నగదు అందజేస్తామంటూ గత నెలలో విజయవాడ తీసుకెళ్లిన విద్యార్థులకు వారి చేతిలో సర్టిఫికెట్లు పెట్టి పంపించారు. ‘ప్రతిభ’ చూపిన వారికి.. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభ అవార్డులను అందజేస్తోంది. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలను అందజేస్తోంది. అక్టోబరు 15న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులకు నగదు, ట్యాబ్‌ల పంపిణీ చేస్తారని సమాచారం అందించారు. ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన వారంతా విజయవాడ వెళ్లారు. తీరా అక్కడ ముఖ్యమంత్రి ఒకరిద్దరు విద్యార్థులకు మాత్రమే ట్యాబ్‌లు, నగదు అందించారు. మిగిలిన విద్యార్థులకు తదుపరి అందజేస్తామని తెలిపినా నేటి వరకూ ట్యాబ్‌లు, నగదు అందలేదు. జిల్లాలో 423 మంది ఎంపిక.. ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన 423 మంది ప్రతిభ పురస్కారాలకు ఎంపికయ్యారు. 10వ తరగతి నుంచి జిల్లాలో 384 మందికి, ఇంటర్ నుంచి 39 మందికి ప్రతిభ అవార్డులు ప్రకటించారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.20 వేల నగదు, ట్యాబ్‌లు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని అందుకోవడం కోసం జిల్లా నుంచి విద్యార్థులు విజయవాడ వెళ్లారు. అక్కడ ఒక్కో జిల్లా నుంచి ఒకరిద్దరిని ఎంపిక చేసి వారికి సీఎం చేతుల మీదుగా నగదు, ట్యాబ్‌లు అందజేశారు. మిగిలిన వారికి ప్రతిభ అవార్డుల సర్టిఫికెట్లు మాత్రమే అందించారు. నగదు, ట్యాబ్‌లు విద్యార్థులు చదివిన పాఠశాలలు, కళాశాలలకు పంపిస్తామని తెలిపారు. సార్ వచ్చాయా.. ‘సార్! మాకు ట్యాబ్‌లు వచ్చాయా? మా అకౌంట్లలో నగదు జమ అయిందా?’ అంటూ విద్యార్థులు ఆయా పాఠశాలల హెచ్ఎంలను అడుగుతున్నారు. ఇప్పటికే ప్రతిభ అవార్డులు పొందిన పలువురు విద్యార్థులు కడప జిల్లా ఇడుపులపాయ, కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో చేరారు. అక్కడ నుంచి స్వస్థలాలకు వచ్చినప్పుడు, ఫోన్ల ద్వారా ట్యాబ్‌లు, నగదు గురించి వాకబు చేస్తున్నారు. తరచుగా విద్యార్థులు వీటి గురించి అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియడం లేదని ఒక ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ ‘సాక్షి’కి తెలిపారు. ట్యాబ్‌లు నేటికీ ఇవ్వలేదు.. విజయవాడలో జరిగిన సమావేశంలో ట్యాబ్‌లు స్టేజ్ మీదకు తెస్తే ఇస్తున్నారనుకున్నాం. కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. ట్యాబ్‌లు పంపిస్తామన్నారు కానీ ఇప్పటికీ పంపలేదు. – చొల్లంగి జానకిరామ్, ప్రతిభ అవార్డు గ్రహీత, పసలపూడి, రాయవరం మండలం ఉన్నత చదువులకు ఉపయోగం.. ప్రతిభ అవార్డు నగదును అకౌంట్లో వేస్తానన్నారు. కానీ జమ కాలేదు. ట్యాబ్‌లు ఇస్తే ఉన్నత చదువులకు ఉపయోగంగా ఉంటుంది. ట్యాబ్‌లు ఇస్తారని ఆశతో వెళ్లినా అక్కడ ఇవ్వలేదు సరికదా నేటికీ అందజేయలేదు. – మెల్లం శ్రీఅమృత, ప్రతిభ అవార్డు గ్రహీత, తొస్సిపూడి, బిక్కవోలు మండలం -
మరీ ఇంత ‘సున్న’ చూపా!
జీవో : 15 ద్వారా జిల్లాకు రూ.43.16 కోట్ల ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులు అమలాపురం, పి.గన్నవరాలకు మొండిచెయ్యి మరో ఆరు నియోజకవర్గాలదీ అదే పరిస్థితి అమలాపురం : కోనసీమకు రాజధాని అమలాపురం. ఎస్సీలకు కేటాయించిన పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్రం. ఇంతటి కీలక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధుల కేటాయింపు ‘సున్నా’. పక్కనే ఉన్న పి.గన్నవరం ఎస్సీ నియోజకవర్గం పరిస్థితి కూడా ఇంతే. ఈ నియోజకవర్గానికి సైతం కేటాయించింది ఏమీలేదు. ఇదే సమయంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి జిల్లాలో కేటాయించిన నిధుల్లో నాలుగో వంతు దక్కడం విశేషం. జిల్లాలో 11 నియోజకవర్గాలకు రూ.43.16 కోట్లు ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల మూడవ తేదీన జీవో ఆర్టీ నెం.15 విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నిధులతో నియోజకవర్గంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, రహదారులకు అప్రోచ్‌రోడ్ల నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు గతంలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ఇప్పుడు సీసీ రోడ్లుగా మార్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దశలో ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసింది. అయితే కేవలం 11 నియోజకవర్గాలకు మాత్రమే కేటాయించి మిగిలిన నియోజకవర్గాలను పక్కన బెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైన అమలాపురం, పి.గన్నవరాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇదే సమయంలో రాజోలు ఎస్సీ నియోజకవర్గానికి రూ.5 కోట్లు కేటాయించడం గమనార్హం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ఏకంగా రూ.11.25 కోట్లు కేటాయించారు. గతంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టే రోడ్లకు ఎస్సీ సబ్‌ప్లా¯ŒS నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా కేటాయించారు. తరువాత సబ్‌ప్లా¯ŒS నిధులు విడుదల కావడం ఇదే. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మరోసారి నిధులు విడుదల చేస్తారనే నమ్మకం అధికారులకు కలగడం లేదు. దీనితో మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు కేటాయింపులు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గాలైన అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలకు నిధులు కేటాయింపు లేకపోవడాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు నిధులు కేటాయించకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీకి చెందిన అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తు న్న నియోజకవర్గాలనే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కూడా నిధుల కేటాయింపులో వివక్ష చూపడం విశేషం. ఎస్సీ సబ్‌ప్లా¯ŒS అందని నియోజకవర్గాలు.. అమలాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం, కాకినాడ సిటీ, తుని, రాజానగరం, రంపచోడవరం, రాజమహేంద్రవరం సిటీ. నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఇలా.. నియోజకవర్గం పేరు రూ.కోట్లలో పిఠాపురం 4 కాకినాడ రూరల్ 4.50 పెద్దాపురం 1.97 అనపర్తి 3 రాజోలు 5 మండపేట 5 రాజమహేంద్రవరం రూరల్ 11.25 జగ్గంపేట 3.36 కొత్తపేట 1.01 ముమ్మిడివరం 0.70 ప్రత్తిపాడు 3.37