
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి బుధవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. మలేషియాలో ఏజెంట్ల చేతిలో బందీలుగా ఉన్నవిశాఖకు చెందిన నలుగురు యువకులు విడిపించాలంటూ ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ధనశేఖర్ అనే ఏజెంట్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి...ఆ యువకులను మలేషియా తీసుకు వెళ్లాడని, అక్కడ వాళ్ల పాస్‌పార్ట్‌లు లాక్కొని బందీలుగా చేశాడని, వారిని విడిపించాలంటూ విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment