భోపాల్ : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.
66 సంవత్సరాల వయసున్న సుష్మా స్వరాజ్ ఆరోగ్య కారణాలతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా సుష్మా స్వరాజ్‌కు రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment