సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు పాస్‌పోర్టు జారీ అంశంలో సాయం చేసినందకు గానూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు సైతం సుష్మాపై మండిపడుతున్నారు. కొందరైతే ఆమెపై అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు. దీనితో సుష్మా ఈ వివాదంపై ప్రజల అభిప్రాయాన్ని కోరాలని నిర్ణయించుకున్నారు. తనపై వస్తున్న విమర్శలపై సుష్మా ట్విటర్‌లో స్పందించారు. ‘నేను కొన్ని ట్వీట్‌లను లైక్ చేశాను. ఇది గత కొన్ని రోజులగా జరుగుతూనే ఉంది. దీన్ని మీరు సమర్ధిస్తారా.. అంటూ పోల్ క్వొశ్చన్ ఉంచారు. దయచేసి రీ ట్వీట్ చేయండి’ అని తన పాలోవర్లను కోరారు.
కాగా ఇటీవల సుష్మా భర్త స్వరాజ్ కౌషల్ చేసిన ట్వీట్‌పై కూడా కొందరు తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. ఆయన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్ గుప్తా చేసిన ట్వీట్ చర్చానీయాంశంగా మారింది. ‘ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్న సంగతి విదితమే.
Friends : I have liked some tweets. This is happening for the last few days. Do you approve of such tweets ? Please RT
— Sushma Swaraj (@SushmaSwaraj) June 30, 2018
Comments
Please login to add a commentAdd a comment