సుష్మాపై మరో పోల్‌.. మండిపడ్డ నెటిజన్లు‌! | Congress conducts another poll on Sushma Swaraj | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 4:35 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress conducts another poll on Sushma Swaraj - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్‌ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. ఇరాక్‌లో 39మంది భారతీయులు మృతిచెందడం విదేశాంగమంత్రిగా సుష్మాకు అతిపెద్ద వైఫల్యమా? అంటూ కాంగ్రెస్‌ ట్విట్టర్‌ పోల్‌ నిర్వహించింది. ఈ పోల్‌కు ఏకంగా 76శాతం మంది ‘నో’ (కాదు) అని సమాధానమిచ్చారు. ఈ పోల్‌ తనకు అనుకూలంగా రావడంతో సుష్మా ఏకంగా కాంగ్రెస్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఈ పోల్‌ బెడిసికొట్టి.. తమకే బ్యాక్‌ఫైర్‌ కావడంతో కంగుతిన్న కాంగ్రెస్‌ పార్టీ మరింత జాగ్రత్తగా.. సుష్మాపై మరో పోల్‌ను ట్వీట్‌చేసింది. సుష్మాకు ధైర్యముంటే ఈ పోల్‌ను రీట్వీట్‌ చేయాలని సవాల్‌ కూడా విసిరింది.

కిందివాటిలో సుష్మా స్వరాజ్‌ అతిపెద్ద వైఫల్యం ఏది?

  • ఇరాక్‌లో 39మంది భారతీయుల మృతి
  • డోక్లాం సమస్య పరిష్కారం కాకపోవడం..’

అంటూ కాంగ్రెస్‌ పార్టీ తన టిటర్‌ పేజీలో పోల్‌ నిర్వహించింది. ఈ పోల్‌లో ఇరాక్‌లో భారతీయుల మృతికి 57శాతం మంది, డోక్లాం సమస్యకు 43శాతం మంది ఓటు వేశారు. అయితే, ఈ పోల్‌లో సుష్మాకు వ్యతిరేకంగా రెండూ ప్రతికూల ఆప్షన్‌లు ఇచ్చి.. కాంగ్రెస్‌ పార్టీ పారదర్శకత లేని పోల్‌ను నిర్వహించిందని, ఇది అన్యాయమని నెటిజన్లు మండిపడుతున్నారు. సుష్మాను ఎలాగైనా అపఖ్యాతి పాలుచేసేందుకే ఈ పోల్‌ నిర్వహించినట్టు కనిపిస్తోందని, భారత్‌కు అతిపెద్ద వైఫల్యం కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీయేనని ఫైర్‌ అవుతున్నారు. ఈ పోల్‌ కింద వచ్చిన రీట్వీట్లలో ఎక్కువ విమర్శలు, కాంగ్రెస్‌పై సెటైర్లు ఉండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement