
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గొంతుక వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. ఢిల్లీలో సుష్మాస్వరాజ్‌కు ఆయన నివాళర్పించారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం ఆమెనని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా "తెలంగాణ చిన్నమ్మ"గా నిలిచిపోతారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ యువకులు బలిదానం కావొద్దు..తెలంగాణ చూడాలని భరోసా నింపిన గొప్ప నాయకురాలని చెప్పారు. గల్ఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు విదేశాంగ శాఖ మంత్రిగా సాయం చేశారన్నారు. ప్రవాసి భారతీయలకు అండగా నిలవడం కోసం ‘మదద్’ వెబ్ సైట్ పెట్టి వారికి అండగా నిలిచారన్నారు. సుష్మా స్వరాజ్ మృతి దేశానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment