బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి కన్నుమూశారు. సుష్మా అకాల మృతితో యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అంత ప్రజాధరణ కలిగిన సుష్మా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సుష్మా.. చివరి శ్వాస వరకు దేశ అభివృద్ది కోసం పాటు పడ్డారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ప్రవేశ పెట్టిన బిల్లు పాస్ కావడంతో ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రం ఆమె చివరి ట్వీట్ చేశారు. ఇందు కోసమే తాను చాలు రోజులుగా వేచి చూస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఏడుగంటల సమయంలో లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందింది. భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదం పొందగానే ఆమె తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో హోం మంత్రి అమిత్ షా హుందాగా ప్రవర్తించారని మరొక ట్వీట్‌లో ప్రశంసించారు. (చదవండి: సుష్మాస్వరాజ్ హఠాన్మరణం)
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019
गृह मंत्री श्री अमित शाह जी को उत्कृष्ट भाषण के लिए बहुत बहुत बधाई.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 5, 2019
I congratulate the Home Minister Shri @AmitShah ji for his outstanding performance in Rajya Sabha.
Comments
Please login to add a commentAdd a comment