
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేతలు కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లు ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తమకు పార్లమెంట్ మాజీ సభ్యులు గల గుర్తింపు కార్డులను మంజూరు చేయాలంటూ. ఈ ఇద్దరు సీనియర్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తొలి సమావేశాలు నిర్వహించేందుకు భేటీ అయిన పార్లమెంట్‌కు వారు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన 17 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఆనారోగ్యం కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మా ప్రకటించగా.. వయో భారంతో మహాజన్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఇక రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంట్లు.. ప్రధాని మోదీ, అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులకు సుమిత్ర మహాజన్ విందును కూడా ఏర్పటుచేసినట్లు సమాచారం. తనకు పార్లమెంట్ సభ్యురాలిగా, లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం కల్పించిందుకు బీజేపీ పెద్దలకు ప్రత్యేక ధన్యావాదాలంటూ ఇటీవల ఆమె ట్వీట్ కూడా చేశారు. అయితే ఆమె ధరఖాస్తును పరిశీలించిన కేంద్రం త్వరలోనే గుర్తింపు కార్డును జారీచేస్తామని చెప్పినట్లు ఆమె వ్యక్తిగత కార్యదర్శి పంకజ్ కృష్ణసాగర్ తెలిపారు.
గత ఎన్నికల్లో ఈ ఇద్దరూ మధ్యప్రదేశ్ నుంచే లోక్‌సభ ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ కేంద్ర విదేశాంగ బాధ్యతలు నిర్వహించిన సుష్మా స్వరాజ్ విధిశ నుంచి, మహాజన్ ఇండోర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో సుష్మా ఢిల్లీకి సీఎంగా గతంలో పనిచేశారు. కాగా త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు సుష్మాపేరును పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment