సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మృతిపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజకీయల్లో గొప్ప నేతను కొల్పోయామని, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఆమె ప్రసంగాల ద్వారా తాను ఎంతో స్ఫూర్తిని పొందానని కవిత గుర్తుచేశారు. ఈమేరకు 1996లో లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగ వీడియోని ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. చరిత్రలో ఇదొక గొప్ప ప్రసంగమంటూ ఆమె పోస్ట్ చేశారు. అప్పట్లో ఆమె ప్రసంగంపై ప్రసంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. కవిత షేర్ చేసిన వీడియోలో బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని కూడా వాజ్‌పేయీ ఉన్నారు.
It’s hard to believe that @SushmaSwaraj Ji is no more. My heartfelt condolences to her family & huge fan base. I have always admired her for her extraordinary oratory skills.This is one of my fav speeches of hers. https://t.co/qR3zWj54kx #RIPSushmaJi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 7, 2019
Comments
Please login to add a commentAdd a comment