గోపీకృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్త్య ముఖ్య తారలుగా ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రుణం’. భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గుండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు, బాంధవ్యాలు, ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్థాల చుట్టూ ఈ చిత్రకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న చిన్న విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం తగ్గుతుంది’’ అన్నారు. ‘‘ఇద్దరు స్నేహితుల కుటుంబాల మధ్య నడిచే కథ ఇది’’ అన్నారు జి.రామకృష్ణారావు. ‘‘ఈ సినిమాకి మంచి టీమ్ కుదిరింది. ఇదే టీమ్‌తో మేలో మరో చిత్రం స్టార్ట్ చేయబోతున్నాం’’ అని భీమినేని సురేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment