దళితులపై నేరాలను నియంత్రించాలి
ఆదిలాబాద్ క్రైం : దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న నేరాల ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడిషనల్ డీజీపీ గోపికృష్ణ ఆదేశించారు. శుక్రవారం వివిధ జిల్లాల ఎస్పీల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కేసుల వివరాలను ఎస్పీ గజరావు భూపాల్ డీజీపీకి వివరించారు. 2012లో 123, 2013లో 113 కేసులు నమోదయ్యాయని, 2014లో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో 74 కేసులు ఉ న్నాయని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో ప్రవేశపెడుతామని తెలిపారు. పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైన వెంటనే డివిజన్ స్థాయి పోలీసు అధికారుల సమక్షంలో దర్యాప్తు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతినెలా నిర్వహించే నే ర సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎ స్టీ కేసులకు సంబంధించి ప్రత్యేక సమయం కేటాయించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీ సీతారాములు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్ర భాకర్‌రావు, కమ్యూనికేషన్ ఎస్సై సురేశ్ తదితరులు పాల్గొన్నారు.