సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్‌రావు సస్పెన్షన్ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మనోహర్‌రావును సస్పెండ్ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనోహర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment