![Sports Ministry Suspends WFI Assistant Secretary Vinod Tomar - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/22/vinod.jpg.webp?itok=6Ur-Hw53)
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు వ్యతిరేకంగా రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. డబ్ల్యూఎఫ్‌ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్‌పై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేసింది. రెజర్లతో చర్చించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వినోద్ తోమర్ అత్యంత సన్నిహితుడు. రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను ఆయనే చూసుకునేవారు. ఈ నేపథ్యంలో వినోద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక శనివారం కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు సఫలం కావడంతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. సమస్యపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ.. సమాఖ్య అధ్యక్షుడు, కార్యదర్శిని తాత్కాలికంగా తప్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంతో రెజ్లర్లు కాస్త శాంతించారు. కాగా ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!
Comments
Please login to add a commentAdd a comment