
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. ఐదుగురి మృతి
కీవ్: ఉక్రెయిన్‌కు సైనిక సాయంపై సస్పెన్షన్‌ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎత్తివేయడంతో ఆయుధాల సరఫరా బుధవారం నుంచి మళ్లీ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికార వర్గాలు ధ్రువీకరించాయి. పోలాండ్ లాజిస్టిక్ సెంటర్ నుంచి ఈ ఆయుధాలు వచ్చినట్లు వెల్లడించాయి. మరోవైపు రష్యాతో 30 రోజులపాటు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు సంకేతాలిచ్చారు.
కాల్పుల విరమణపై అమెరికా నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. ఒకవైపు శాంతి కోసం ప్రయ త్నాలు జరుగుతుండగా, మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధ వారం ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిప ణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఐదుగురు మర ణించినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.

Comments
Please login to add a commentAdd a comment