వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను పునరుద్ధరించనున్నట్లు మెటా ప్రకటించింది. 2021 జనవరిలో క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ ఖాతాలను రద్దు చేయడం తెలిసిందే. అప్పటికి ట్రంప్‌కు ఫేస్‌బుక్‌లో 3.4 కోట్లు, ఇన్‌స్టాలో 2.3 కోట్ల ఫాలోవర్లున్నారు.
నేతలు ఏం చెబుతున్నారో ప్రజలు వినగలిగినప్పుడే తమకిష్టమైన వాటిని ఎంపిక చేసుకోగలరని మెటా గ్లోబల్ ఎఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ బుధవారం ప్రకటించారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదికైన ఫేస్‌బుక్ ట్రంప్ రాజకీయ ప్రచార నిధుల సేకరణకు కీలక వనరుగా ఉంది. ఈ నేపథ్యంలో, ‘‘నన్ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాల నుంచి తొలగించినందుకు మెటా లక్షలాది డాలర్ల ఆదాయం పోగొట్టుకుంది. అందుకే నా ఖాతాను పునరుద్ధరిస్తోంది’’ అని ట్రంప్ తన సొంత సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో స్పందించారు.
చదవండి: Union Budget 2023: అరుదైన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం.. అదో రేర్ రికార్డ్!
Comments
Please login to add a commentAdd a comment