ఒడిశా: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి మజ్జిగుడ పంచాయతీలోని ఉపొరొసొజ్జ గ్రామంలో సోమవారం కల్వర్టు సెంట్రింగ్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం అందుకు సంబంధించి రూరల్ డవలప్‌మెంట్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ మహంతి, అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్ మండల్, జూనియర్ ఇంజినీర్ వెంకటరమణ ముదిలిలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సంజయ్ సింహ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలయ్యాయని, సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంట్రాక్టర్‌పై కేసు నమోదు
కల్వర్టు కూలిన ఘటనలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ తెలియజేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్‌పై ఇప్పటికే కేసు నమోదయ్యిందని పేర్కొన్నారు.
చర్యలు తీసుకోవాలి
బాధితులకు నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బిజయ్ కుమార్ గొమాంగొ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి ఆయన చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటువంటి తరహా ఘటనలు పునరావృతమవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment