( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వివరాల ప్రకార.. చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక, స్కిల్ కుంభకోణం కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది.
ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్రమంలో శుక్రవారంలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ విధించారు. మరోవైపు.. నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: విశాఖ బీచ్‌కు కొట్టుకొచ్చిన అరుదైన పెట్టె.. చూసేందుకు ఎగబడ్డ జనం!
Comments
Please login to add a commentAdd a comment