సాక్షి,చిలకలగూడ(హైదరాబాద్): చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో జరిగిన ‘యాక్షన్..ఓవరాక్షన్’ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. క్రమశిక్షణచర్యల్లో భాగంగా కానిస్టేబుల్ ఏ. శ్రీనాథ్ (పీసీ 4670)ను సిటీ ఆర్ముడ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ నగర అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్టుగూడకు చెందిన ఆరోక్యరాజ్ మద్యం మత్తులో ఈనెల 3న బస్తీలో వీరంగం సృష్టించాడు. దీనిపై సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అడ్డుకునేందుకు యత్నించగా, కర్రతో దాడికి యత్నించాడు.
నలుగురు కానిస్టేబుళ్లు అరోక్యరాజ్‌ను నేలకు అదిమిపట్టి బూటుకాళ్లతో చేతిపై తన్ని కర్రను లాక్కున్నారు. ఈ క్రమంలో ఆరోక్యరాజ్ కాలు విరిగింది. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. కానిస్టేబుల్ శ్రీనాథ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆరోక్యరాజ్‌పై 13 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మద్యం మత్తులో మెట్టుగూడ స్కెలాబ్ హోటల్‌లో కిందపడి కాలికి గాయం అయిందని వివరిస్తూ చిలకలగూడ పోలీసులు వీడియో ఫుటేజీలను మీడియాకు విడుదల చేశారు. వాహనంలో పెట్రోలు పోయించుకుని డబ్బులు అడిగినందుకు పెట్రోలు బంకు సిబ్బందిపై దాడి చేసిన వీడియోలను షేర్ చేశారు. విరిగిన కాలుకు సర్జరీ చేశామని, వైద్యసేవల అనంతరం ఆరోక్యరాజ్ కోలుకుంటున్నాడని గాంధీ వైద్యులు తెలిపారు.
చదవండి: Telangana Politics: 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్?
Comments
Please login to add a commentAdd a comment