
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆయనను బీజేపీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. రాజాసింగ్ ఏం మాట్లాడారనే విషయం కూడా తనకు తెలియదన్నారు. యూట్యూబ్‌లో ఆయన మాట్లాడిన వీడియో చూసేందుకు ప్రయత్నించానని కానీ, ఎక్కడా అందుబాటులో లేదని పేర్కొన్నారు.
కాగా.. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని రాజాసింగ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!
Comments
Please login to add a commentAdd a comment