గాంధీఆస్పత్రి : ర్యాగింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యారి్థని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్రెడ్డి నేతృత్వంలో గురువారం కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌లో ర్యాగింగ్‌కు సంబంధించి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టగా 2020 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సదరు విద్యారి్థని ఏడాది పాటు హాస్టల్‌తోపాటు కళాశాలను నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలో ర్యాగింగ్‌కు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులు, వారి తల్లితండ్రులు యాంటి ర్యాగింగ్ కమిటీని కలిసి మరోమారు ర్యాగింగ్‌కు పాల్పడమని, సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా, కమిటీ వారి అభ్యర్థనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
యాంటీ ర్యాగింగ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇకపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గాం«దీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, కాలేజీకి చెడ్డపేరు తెచ్చెవారిని ఉపేక్షించరాదని తీర్మానించి, ర్యాగింగ్ నిరోధానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ రాజారావులతోపాటు పలు విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment