
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రాన్ని మూడోసారి పాలించే హక్కును బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయిందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కిరీటం ఏమీ పోలేదని, మరింత గౌరవం పెరిగిందన్నారు. గత మూడేళ్లుగా తనను పార్టీ సభ్యుడిగా చూడలేదని, కనీసం సభ్యత్వ పుస్తకాలను కూడా చేతికివ్వలేదని చెప్పారు.
అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇప్పుడు తనకు పంజరం నుంచి బయటకు వ చ్చినంత సంతోషంగా ఉందని చెప్పారు. రిమోట్ కంట్రోల్ అంతా ప్రగతిభవన్‌లోనే ఉందని చెప్పా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఇంట్లో పెట్టుకుంటే మంత్రి నిరంజన్‌రెడ్డికి కోపమెందుకని ప్రశ్నించారు. తన ఇంట్లో సీఎం కేసీఆర్ ఫొటో కూడా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 సీట్లలో బీఆర్‌ఎస్ వ్యతిరేకులే గెలుస్తారని జోష్యం చెప్పారు. బీఆర్‌ఎస్ కనీసం ఒక్క సీటు గెలవడం కూడా అనుమానమేనన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదట 2.50 లక్షల ఎకరాల సామర్థ్యానికే మంజూరైందని, తర్వాత 3.50 లక్షల ఎకరాలకు తానే పెంచానని చెప్పారు. కేఎల్‌ఐ ద్వారా వనపర్తికి నీళ్లు రావడంతోనే ఆయనకు పేరొ చ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఖాదీ బోర్డు చైర్మన్‌గా ఉన్న నిరంజన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అయినా పదవికి రాజీనామా చేయకపోవడంతో బోర్డునే రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
జూపల్లికి డీకే అరుణ ఫోన్
‘మీరు దేని కోసమైతే పోరాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడంలేదు. ఈ నియంతృత్వ ప్రభుత్వంపై సమష్టిగా పోరాటం చేద్దాం’అని సీనియర్ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి రండి అంటూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్సన్‌కు గురైన జూపల్లికి ఆమె ఫోన్ చేసి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment