ఢిల్లీకి సంచులు మోయడంలో సీఎం బిజీ
మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రోజుకు 18 గంటలు కష్టపడు తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నా రని, దోచుకోవడానికి కష్టపడుతున్నారా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. వందరో జుల్లో సంపద అంతా దోచుకున్నారని, రాష్ట్రం నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు బాధపడుతున్నా..తుక్కుగూడ సభలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు సైతం రైతుల గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9నే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు.
ఇప్పు డు దేశ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నా యకులు శ్రీకారం చుట్టారని, 2014 కంటే ముందు అరాచకాలు మళ్లీ రాష్ట్రంలో మొదలయ్యా యని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కేసుల గురించి ఎన్నడూ మాట్లాడ లేదని, మేము రైతుల గురించి మాట్లాడుతుంటే, కాంగ్రెస్‌వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లా డుతున్నారని చెప్పారు. రైతుగోడు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడన్నారు.
ఓ వైపు పార్టీ మారిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని, మరోవైపు పార్టీ మారిన వారిని డిస్ క్వాలిఫై చేయాలని చట్టం తెస్తామని మాట్లాడుతుంటే.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూసి బాధపడి కేసీఆర్ సూచనలు ఇస్తుంటే..అవి పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ నిబంధనలు లేకుండా కృష్ణా జలాలను నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటికి విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment