సాక్షి, హైదరాబాద్: రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు.
‘‘బీఆర్‌ఎస్ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్‌ఎస్ సంబురాలు చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసులు పెట్టీ సంబురాలు చేసుకుంటుంది.
..కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషి గా మల్లెపువ్వు లాగా, కడిగిన ముత్యం లాగ బయటకొస్తాడు.
..ఈ ఫార్ములా కారు రేస్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్లా పడటం ఖాయం. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి లాయర్లను వెంట బెట్టుకొని వెళ్తారు. కేటీఆర్ లాయర్లతో ఏసీబీ విచారణకు వెళ్ళొద్దా?. రాహుల్‌కి ఒక చట్టం.. కేటీఆర్‌కి ఒక చట్టం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. రేవంత్ డైరెక్షన్‌లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్‌లో ఈడీ పనిచేస్తోంది’’ అంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment