సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court)లో ఆయన సవాల్ చేశారు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ కేసును కొట్టేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ కేసులో తాజా పరిణామాలపై ఏసీబీ ఆఫీసులో అధికారులు భేటీ అయ్యారు. ఎఫ్‌ఈవో, హెచ్‌డీఏతో పాటు రెవెన్యూ అధికారుల పాత్రపై చర్చించడంతో పాటు సుప్రీం కోర్టును కేటీఆర్ ఆశ్రయించడంతో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.
మరో వైపు.. అధికారులు అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి నోటీసులపై చర్చతో పాటు, మొదటి రేసు తర్వాత తప్పుకున్న కంపెనీలపై కూడా చర్చించారు. ఏసీబీ ఉన్నతాధికారులతో బంజారాహిల్స్ ఏసీపీ,సీఐతో పాటు కొంతమంది సిబ్బంది సమావేశమయ్యారు. క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కాగా, తమ వాదన కూడా వినాలని ప్రభుత్వం.. కేవీయట్ వేసింది.
ఇదీ చదవండి: కేటీఆర్‌దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment