రాష్ట్రంలో త్వరలోనే 4.50 లక్షల ఇళ్లు: మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, పల్లె దవాఖానా ప్రారంభించి బీపీ పరీక్ష చేయించుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా మారిందన్నారు. త్వరలో రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల సంçస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, డీఎంహెచ్‌ఓ మాలతి, ఆర్డీఓ గణేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment