నదికి తిరిగి జీవం పోసిన విధానాన్ని అడిగి తెలుసుకున్న పొంగులేటి బృందం
సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్ సందర్శన
యంగ్‌వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో కీ హాక్ సంగ్‌తో భేటీ
సియోల్‌లో రెండోరోజు పర్యటన
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుద్ధరణపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని సియోల్ వెళ్లిన అధికారుల బృందం రెండో రోజైన మంగళవారం అక్కడ విస్తృతంగా పర్యటించింది. తొలుత హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఒక ప్పుడు మురికి కాలువలా ఉన్న నదికి జీవం పోసిన విధానాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం అక్కడి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.
సియోల్‌లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందో అక్కడి అధికారులు వారికి వివరించారు. అనంతరం మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ యంగ్‌వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో ‘కీ హాక్ సంగ్’తో సమావేశమైంది. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందు కొచ్చిన ఆయన.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఏర్పాటైన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ గురించి పొంగులేటి, పొన్నం ఆయనకు వివరించారు. ఆ తర్వాత సియోల్ లోని సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్‌ను అధికారుల బృందం సందర్శించింది. నీటి శుద్ధీక రణ ఎలా జరుగుతోందో పరిశీలించింది.
సియోల్‌లోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ఈ కేంద్రాలు శుభ్రపరుస్తాయి. రోజుకు 16.3 లక్షల లీటర్ల మురుగునీటితోపాటు 4 వేల కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ సామ ర్థ్య ం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ప్లాంటుగా గుర్తింపు పొందింది. ఇదే కేంద్రంలో హాన్ నది నీటి స్వచ్ఛతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.
ప్రతిపక్షాలు సహకరించాలి
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సియోల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మూసీని భాగం చేయాలని తమ ప్రభు త్వం భావిస్తోందన్నారు.
నిర్వాసితులకు ఎలాంటి కష్టం రానివ్వబోమని.. పునరావాసంతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ మరో సియోల్ నగరంగా రూపాంతరం చెందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment