కొత్త రేషన్‌కార్డులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన | Minister Uttam Kumarreddy Pressmeet On New Ration Cards | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ: మంత్రి ఉత్తమ్‌

Published Mon, Sep 16 2024 4:49 PM | Last Updated on Mon, Sep 16 2024 5:13 PM

Minister Uttam Kumarreddy Pressmeet On New Ration Cards

సాక్షి,హైదరాబాద్‌: అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.సోమవారం(సెప్టెంబర్‌16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌ మీడియాతో  మాట్లాడారు.

‘పదేళ్లలో  నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు  క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్‌కార్డులిస్తాం’అని తెలిపారు. 

ఇదీ చదవండి.. నిమజ్జనానికి అంతా రెడీ.. జీహెచ్‌ఎంసీ మేయర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement